ETV Bharat / state

వామపక్ష నేతలతో తెరాస నాయకుల భేటీ.. పొత్తు కొనసాగేనా..? - వామపక్షాలతో పొత్తు కొనసాగించాలని టీఆర్ఎస్

TRS Leaders Meet CPI Leaders: మునుగోడు ఉపఎన్నికలో తెరాస విజయానికి తోడ్పడిన వామపక్షాల మద్దతు భవిష్యత్​లోనూ కొనసాగేలా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ నేతలు ఇవాళ సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. సీపీఐ నాయకులతో భేటీ అయ్యారు. రామగుండంలో మోదీ పర్యటన సందర్భంగా విభజన సమస్యలపై పోరాటానికి ఉమ్మడి కార్యాచారణతో ముందుకెళ్లడంపై చర్చిస్తున్నారు.

TRS Leaders Meet CPI Leaders
TRS Leaders Meet CPI Leaders
author img

By

Published : Nov 8, 2022, 12:33 PM IST

TRS Leaders Meet CPI Leaders: వామపక్షాల పొత్తుతో ఇటీవల మునుగోడు ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన తెరాస... ఆ దిశగానే ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీకి చెందిన నేతలు.. వామపక్ష నాయకులతో మరోసారి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్ సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.

మగ్ధుంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకట్‌రెడ్డితో వారు భేటీ అయ్యారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత సీపీఐ కార్యాలయానికి తెరాస నేతలు రావటంపై ప్రాధాన్యత నెలకొంది. ఈ నెల 12న రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తుండగా.. ఈ సందర్భంగా విభజన సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని వామపక్ష నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే తెరాస నాయకులు సీపీఐ నేతలతో భేటీ కావటం చర్చనీయంగా మారింది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే తెరాస నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.