ETV Bharat / state

తెరాస జిల్లా కార్యాలయాల నిర్మాణానికి విరాళం - తెరాస పార్టీ కార్యాలయాల నిర్మాణానికి నిధులు

తెరాస పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. కుత్బుల్లాపూర్​, రామగుండం ఎమ్మెల్యేలు రెండున్నర లక్షల చొప్పున చెక్కులను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​కు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ నేతలను అభినందించారు.

పార్టీ కార్యాలయ నిర్మాణం
author img

By

Published : Jun 26, 2019, 10:07 PM IST

పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణానికి విరాళాలు

తెరాస జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల విరాళాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మరో నలుగురు నేతలు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించారు. కుత్బుల్లాపూర్, రామగుండం ఎమ్మెల్యేలు వివేక్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్ రెండున్నర లక్షల రూపాయల చొప్పున పార్టీ కార్యాలయాల నిర్మాణ నిధికి ఇచ్చారు. ప్రగతిభవన్​లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను కలిసి చెక్కులు అందచేశారు. కార్యాలయాల నిర్మాణం కోసం తమ వంతు సాయమందించిన నేతలను కేటీఆర్​ అభినందించారు.

ఇదీ చూడండి : ఇర్రం మంజిల్‌ భవనాన్ని ప్రభుత్వం పరిరక్షించాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.