కరోనా వైరస్ ప్రభావం రోజూవారి కూలీలపై తీవ్రంగా పడుతోంది. ఏరోజుకారోజు పనిచేసుకుంటూ బతుకీడుస్తున్న వారు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు హైదరాబాద్ నల్లకుంట డివిజన్‌కు చెందిన తెరాస సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్ ముందుకొచ్చారు.
బస్తీలోని 85 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆపత్కాల పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు సామాజిక స్పృహ చాటుకొని, సేవా దృక్పథం ఉన్న వారిగా నిరూపించుకోవాలని కోరారు.
కరోనా వేగంగా వ్యాపిస్తున్నందున ప్రతిఒక్కరు ఇంట్లోనే ఉండి, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించి, వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.