హైదరాబాద్ కింగ్ కోఠిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని సమక్షంలో ఆదివారం జరిగిన ఘర్షణ క్షణికావేశంలో జరిగిందని... తమ మధ్య ఎటువంటి అంతర్గత తగాదాలు లేవని తెరాస సీనియర్ నాయకుడు, ఉద్యమ నేత ఆర్వీ మహేందర్ కుమార్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో సీనియర్ నాయకుడైన తనను వేదికపైకి పిలవకపోవడంతో మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు.
గెలుపు కోసం కృషి చేస్తా...
తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని ... కానీ నియోజకవర్గంలో తనకు తగిన ప్రాధాన్యత లభించకపోవడం బాధాకరమన్నారు. ఎటువంటి పదవులను ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం తనకు న్యాయం చేస్తుందని పూర్తి నమ్మకం ఉందని... రానున్న ఎమ్మెల్సీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తానని మహేందర్ కుమార్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: హోంమంత్రి ముందే తెరాస నేతల కుమ్ములాట