రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారిని జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిరోధించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెరాస ప్రతినిధి బృందం ఫిర్యాదు చేసింది.
భాజపా కండువా కప్పుకొని ఆచారి ప్రచారం చేస్తున్నారన్న తెరాస నేతలు ఆయనపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అటు హైకోర్టు ఉత్తర్వులు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజకీయ సభ నిర్వహించిన భాజపా ఎంపీ తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని తెరాస కోరింది.