ETV Bharat / state

ప్రభుత్వం.. ఉపాధ్యాయులపై కక్ష కట్టింది: చాడ - ఉపాధ్యాయులపై అధిక భారం

పని ఒత్తిడి ఉండదనే సాకుతో ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదనే విధంగా అధికార వర్గాల నుంచి సంకేతాలు రావడం అర్థరహితమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సరిపడా ఉపాధ్యాయులు లేక.. ఎక్కువ క్లాసులు తీసుకుంటున్న వారిపై అధిక భారం పడుతోందన్న విషయం ప్రభుత్వానికి తెలియనిదా అంటూ నిలదీశారు.

ప్రభుత్వం.. ఉపాధ్యాయులపై కక్ష కట్టింది: చాడ
trs govt has sided with teachers In the case of wage revision says cpi state secretary
author img

By

Published : Feb 10, 2021, 11:01 PM IST

వేతన సవరణ విషయంలో ఉద్యోగులను, ఉపాధ్యాయులను వేర్వేరుగా పరిగణిస్తూ ప్రభుత్వం విభజించు-పాలించు అనే సూత్రాన్ని అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఎంఎల్‌సీ ఎన్నికల్లో వరుసగా తెరాస అభ్యర్థులు ఓటమి పాలవుతుండటంతో.. ప్రభుత్వం, ఉపాధ్యాయులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యలయంలో ఆయన మాట్లాడారు.

పని ఒత్తిడి ఉండదనే సాకుతో ఉపాధ్యాయులకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదనే విధంగా అధికార వర్గాల నుంచి సంకేతాలు రావడం అర్థరహితమన్నారు చాడ. వేతన సవరణ అనేది పని దినాలపై కాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

సరిపడా ఉపాధ్యాయులు లేక.. ఎక్కువ క్లాసులు తీసుకుంటున్న వారిపై అధిక భారం పడుతోందన్న విషయం ప్రభుత్వానికి తెలియనిదా అంటూ నిలదీశారు. తెరాస.. ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తక్షణమే పీఆర్‌సీ, పదోన్నతులను వర్తింపజేయాని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: మేం తల్చుకుంటే మీరు మిగలరు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.