ETV Bharat / state

trs winning celebrations : తెలంగాణ భవన్​లో అంబరాన్నంటిన సంబురాలు - హైదరాబాద్​ వార్తలు

trs winning celebrations: స్థానిక సంస్థల ఎన్నికల్లో 12కు 12 స్థానాలు గెలుచుకోవడంతో.... తెరాస శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ భవన్‌లో డప్పుచప్పుళ్లు, డీజే మోతలతో గులాబీ శ్రేణులు ఆడిపాడుతున్నారు. ఐదు జిల్లాల్లోనూ గెలుపొందిన అభ్యర్థులతో కలిసి శ్రేణులు పటాకులు పేలుస్తూ ఉత్సాహంగా డ్యాన్స్​ చేశారు.

trs celebrations
trs celebrations
author img

By

Published : Dec 14, 2021, 3:25 PM IST

Updated : Dec 14, 2021, 3:47 PM IST

trs winning celebrations: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో తెలంగాణ భవన్​లో సందడి వాతావరణం నెలకొంది. తెరాస శ్రేణులు బాణాసంచాలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మంత్రులు శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మధుసూదనచారి తదితరులు పాల్గొని.. గెలుపొందిన తెరాస అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రంలో తెరాస విజయాల పరంపర కొనసాగుతోందని మంత్రి శ్రీనివాసయాదవ్ అన్నారు. శాసన మండలిలో ఇతర పార్టీలకు అవకాశం లేదని ఎద్దేవా చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టే వారికి తెరాస విజయం చెంప పెట్టు అన్నారు. ప్రతిపక్షాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.

తెరాస ఓట్లు చీలుతాయని విపక్షాలు గాల్లో మేడలు కట్టుకున్నాయని.. అయితే కాంగ్రెస్, భాజపా ప్రజా ప్రతినిధులు కూడా గులాబీ జెండాకు ఓటేశారమి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పచ్చని తెలంగాణను నాశనం చేయాలని విపక్షాలు కుట్రపన్నుతున్నాయని... తెరాస ఎవరికీ భయపడదన్నారు. ఎంపీటీసీల సమస్యలను కొన్ని తీర్చామని.. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో అన్నింటిన పరిష్కరిస్తారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

తెలంగాణ భవన్​లో అంబరాన్నంటిన సంబురాలు

ఇదీ చూడండి: MLC elections Results 2021: ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస విజయం

Last Updated : Dec 14, 2021, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.