ETV Bharat / state

'చిత్తశుద్ధి ఉంటే భాజపా నేతలు రూ.25వేలు అందించాలి' - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్

జీహెచ్​ఎంసీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రూ.25వేల సాయాన్ని బాధితులకు అందించాలని తెరాస నేతలు డిమాండ్ చేశారు. బేగంబజార్‌లోని ఓ హోటల్​లో నియోజకవర్గానికి చెందిన తెరాస కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

trs candidates meeting on failure of ghmc elections at gosha mahal in hyderabad
'చిత్తశుద్ధి ఉంటే భాజపా నేతలు రూ.25వేలు అందించాలి'
author img

By

Published : Dec 13, 2020, 7:01 PM IST

భాజపా నేతలు వరద బాధితులకు రూ.25 వేల సాయం అందిస్తామని చెప్పి ఓట్లు దండుకున్నారని... ప్రజలకు ఇచ్చిన హామీపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సాయం అందించాలని తెరాస నాయకులు డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో తెరాస అభ్యర్థులు ఓడిపోవడంతో... బేగంబజార్‌లోని ఓ హోటల్​లో నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ అభ్యర్థులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లు రూ.25 వేల సాయాన్ని 15 రోజుల వ్యవధిలో అందించాలని తెరాస రాష్ట్ర నాయకుడు నంద కిషోర్ వ్యాస్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బాధితులంతా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇళ్ల ముందు నిరసనలు వ్యక్తం చేస్తామని హెచ్చరించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజాసింగ్ గత ఆరేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: నల్లగొండ జిల్లాకు మరో రెండు ఎత్తిపోతల పథకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.