ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలంటే తెరాసకే ఓటు వేయాలంటూ తార్నాక 143వ డివిజన్ అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని లాలాపేట్‌లో మంత్రి పద్మారావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు తెరాసను ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీలతరెడ్డి కోరారు.