ETV Bharat / state

తెరాస, భాజపా ఒక్కటేనంటూ రేవంత్​ బహిరంగ లేఖ - trs

తెరాస, భాజపా రెండు ఒకటేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఫైట్‌... కేంద్రంలో రైట్‌ అన్నచందాన ఆ రెండు పార్టీలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు.

తెరాస, భాజపా ఒక్కటేనని రేవంత్​ బహిరంగ లేఖ
author img

By

Published : Sep 11, 2019, 1:40 AM IST

గవర్నర్‌ వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర శాఖ మౌనంగా ఎందుకు ఉందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో తెరాస, భాజపా దోస్తికి ఇదే నిదర్శనమని ఆయన బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం... అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాశానికి ఎత్తారని ఆరోపించారు. దూరదర్శన్‌ వేదికగా గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే 24 గంటల్లో రాష్ట్రంపై ఇంత అవగాహన రావడం ఒకింత ఆశ్చర్యమే కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల కిందట విద్యుత్తు కొనుగోళ్లలో తాను వెలికి తీసిన అవినీతిని తిరిగి తామే బయటకు తీసినట్లు భ్రమలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని భాజపా నేతలు ఆరోపిస్తున్నప్పటికీ...కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు కొనుగోళ్ల అవినీతిపై ఆధారాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు రేవంత్‌ తెలిపారు. తెరాసతో ఉత్తుత్తి ఫైట్‌ చేస్తూ... ప్రజలకు భ్రమలు కల్పించినందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమలం, గులాబీ పువ్వులు కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు.

తెరాస, భాజపా ఒక్కటేనంటూ రేవంత్​ బహిరంగ లేఖ

ఇదీ చూడండి: కేసీఆర్​ది కలియుగ రాచరిక పాలన: ఎంపీ రేవంత్ రెడ్డి

TG_Hyd_62_10_REVANTH_LETTER_AV_3038066 Reporter: Tirupal Reddy Dry గమనిక: రేవంత్‌ లేఖను ఇందుకు వాడుకోగలరు. డెస్క్‌ వాట్సప్‌కు పంపించాను. ()తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు రెండు కూడా ఒకటేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఫైట్‌...కేంద్రంలో రైట్‌ అన్నచందాన ఆ రెండు పార్టీలు అటు కేంద్రంలో...ఇటు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. రెండు రోజుల కిందట గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తివేశారని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అయినా గవర్నర్‌ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర శాఖ మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నించిన ఆయన తెరాస దోస్తికి ఇదే నిదర్శనమని ద్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత అద్భుతం...అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని నూతన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆకాశానికి ఎత్తేశారని ఆరోపించారు. దూరదర్శన్‌ వేదికగా గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే 24 గంటల్లో రాష్ట్రంపై ఇంతగా అవగాహన రావడం ఒకింత ఆశ్చర్యమే కలిగిస్తోందని పేర్కొన్నారు. తెరాస సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రజల్లో భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రెండేళ్ల కిందట తాను వెలికి తీసిన విద్యుత్తు కొనుగోళ్లు అవినీతిని తిరిగి తెరపైకి తామే బయటకు తీసినట్లు భ్రమలు కల్పిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ...కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు విచారణ చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్తు కొనుగోళ్ల అవినీతిపై ఆధారాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి అందచేయనున్నట్లు రేవంత్‌ తెలిపారు. తెరాసతో ఉత్తుత్తి ఫైట్‌ చేస్తూ...ప్రజలకు భ్రమలు కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ-తెరాస కలిసి ఆడుతున్న ఈ డబుల్‌ గేమ్‌ను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని...కమలం, గులాబి పువ్వులు రెండు కలిసికట్టుగా రాష్ట్ర ప్రజల్లో పువ్వులు పెట్టే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.