ETV Bharat / state

భాగ్యనగరంలో ఆహ్లాదకరమైన, అత్యాధునిక బస్​షెల్టర్లు.! - Trendy bus shelters news

ఆర్టీసీ అంటేనే సురక్షితమైన ప్రయాణం. ఇప్పుడు దాన్ని సౌకర్యవంతమైన ప్రయాణంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రేటర్​ పరిధిలో ప్రయాణికులకు అనుగుణంగా బస్టాప్​లు లేకపోవడంతో వారు అనేక అవస్థలు పడుతున్నారు. ఇకపై అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా... ఆధునికమైన బస్టాప్​లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల కోసం వేచి చూసే వారికి బస్టాప్​లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటుంది.

rtc
rtc
author img

By

Published : Jan 1, 2021, 10:14 AM IST

గ్రేటర్ పరిధిలో అత్యధిక మంది ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తుంటారు. గ్రేటర్ పరిధిలో 2,700ల ఆర్టీసీ బస్సులు ఉండగా.. లాక్​డౌన్ తర్వాత ప్రస్తుతం 1,700ల బస్సులను మాత్రమే తిప్పుతున్నారు. లాక్​డౌన్​కు ముందు ఆర్టీసీ బస్సుల్లో 33 లక్షల మంది ప్రయాణించేవారు. లాక్​డౌన్ తర్వాత కేవలం 14లక్షల మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. 2,000ల బస్టాప్​లు.. 1,147ల బస్​షెల్టర్లు ఉన్నాయి. బస్​స్టాపులు ఎక్కువగా ఉండి బస్​షెల్టర్​లు తక్కువగా ఉండడంతో వర్షాకాలంలో.., వేసవికాలంలో ప్రయాణికులకు అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇది ప్రయాణంపై కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఇకపై బస్​స్టాపుల్లో వేచి ఉండే వారికి ఆహ్లాదకరమైన, అత్యాధునిక బస్​షెల్టర్లను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ ఆలోచన చేస్తోంది.

ఇప్పటికే.. హైటెక్​ సిటీ, సోమాజిగూడ, కేపీహెచ్​బీ కాలనీ తదితర ప్రాంతాల్లో అత్యాధునికమైన బస్టాప్​లను నిర్మించారు. ఇప్పుడు మెట్రో రూట్​లోని కొన్ని ప్రాంతాల్లో బస్​షెల్టర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. లాక్​డౌన్​ తర్వాత తిరిగి ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభమైన.. ఎక్కువ మంది సొంత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో ఆర్టీసీకి 50శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) వస్తుంది. ఇప్పుడు దాన్ని మరింత పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. అందులో భాగంగా జేబీఎస్, కోఠీ, అమీర్​పేట్, ఎర్రగడ్డ, సంజీవరెడ్డి నగర్, ప్యాట్నీ, దిల్​సుఖ్​నగర్, కూకట్​పల్లి, కొండాపూర్, బాలానగర్, లక్డీకాపూల్​ బస్టాపుల్లో సూపర్​వైజర్లను ఏర్పాటు చేశారు. వాళ్లు బస్టాపుల్లో బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులకు బస్సుల సమయ వివరాలు తెలియజేస్తున్నారు.

జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సంయుక్తంగా నిరుపయోగంగా ఉన్న బస్​షెల్టర్లు, కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రాంతాలపై ఇప్పటికే సర్వే చేసినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సుమారు 500ల నూతన బస్​స్టాపులను నిర్మించాలని ఆలోచన చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మరో పక్క ప్రయాణికులు సైతం బస్టాప్​లు అందుబాటులోకి వస్తే.. మరింత సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో, ఎండాకాలంలో అనేక ఇబ్బందులు పడుతున్నాయని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

ప్రయాణికులను ఆకట్టుకోవడంలో భాగంగా ఆర్టీసీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా నిర్మించే బస్టాప్​ల రూపురేఖలను కూడా మార్చుతుంది. ఆధునికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలతో కనీసం ఇప్పటికైనా ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందని సిబ్బంది అంచనా వేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.