కొవిడ్-19 ప్రభావంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దేశంలో రైళ్లన్నింటిని మార్చి 31 వరకు రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్లకు సంబంధించి జూన్ 21 వరకు రీఫండ్ తీసుకునే అవకాశముందని దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. గూడ్స్రైళ్లు యథావిధిగా నడుస్తాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులను కూడా నిలిపివేస్తున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేట్ వాహనాలు వేటినీ నడపవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా రవాణా వ్యవస్థను రద్దు చేయడం వల్ల ప్రజలు ఇంటికే పరిమితమవుతారని అధికారులు భావిస్తున్నారు. మెట్రో రైళ్ల రద్దును మార్చి 31 వరకు పొడిగించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్