ETV Bharat / state

48,500 దరఖాస్తులు... రూ.970 కోట్లు! - liquor applications

మద్యం కోసం నిర్వహించిన టెండర్లలో దాదాపు 48,500 దరఖాస్తులకు గాను ప్రభుత్వ ఖజానాకు రూ.970 కోట్లు సమకూరాయని ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది.

48,500 దరఖాస్తులకు రూ.970 కోట్ల రాబడి
author img

By

Published : Oct 17, 2019, 4:20 PM IST

రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోవడానికి లిక్కర్ వ్యాపారులు అనూహ్యంగా స్పందించారు. ప్రభుత్వానికి దరఖాస్తుల రుసుం కింద దాదాపు రూ.970 కోట్లు రాబడి వచ్చింది. సుమారు 48,500 దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా చాలా ఎక్సైజ్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం వల్ల పూర్తి వివరాలు రాలేదన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి స్థాయి వివరాలు అందనున్నాయని కమిషనర్ తెలిపారు. ప్రధానంగా వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి డివిజన్​లల్లో దరఖాస్తులు అత్యధికంగా వచ్చినట్లు స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతున్నందున మధ్యాహ్నం తర్వాతే వీటి సంఖ్య వెలువరిస్తామని సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఏపీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున అక్కడి లిక్కర్‌ వ్యాపారులు తెలంగాణాలో లిక్కర్ దుకాణాల కోసం పోటీ పడ్డారు. ఫలితంగా గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఎక్సైజ్‌ యంత్రాంగం పారదర్శకతతో పని చేసిందని సోమేశ్ కుమార్ కొనియాడారు. ప్రభుత్వానికి గతం కంటే రెట్టింపు ఆదాయం సమకూరిందని అధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

ఇవీ చూడండి : ఇక చర్చలకు ఆస్కారమే లేదు: సీఎం

TG_Hyd_14_17_LIQUOR_APPLICATIONS_FOLLOWUP_AV_3038066 Reporter: Tirupal Reddy ()తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి లిక్కర్ వ్యాపారుల నుంచి అనూహ్యస్పందన రావడంతో ప్రభుత్వానికి ధరఖాస్తుల ఫీజు కింద దాదాపు రూ.970 కోట్లు రాబడి వచ్చింది. దాదాపు 48,500 ధరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. అర్థరాత్రి దాటిన తరువాత కూడా చాలా ఎక్సైజ్‌ కార్యాలయాల్లో ధరఖాస్తులు స్వకరించడంతో పూర్తి వివరాలు రావడానికి మధ్యాహ్నం ఒంటిగంట పట్టొచ్చని ఆయన వివరించారు. ప్రధానంగా వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి డివిజన్లల్లో అత్యధికంగా ధరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ధరఖాస్తులకు చెందిన పూర్తి వివరాలు పరిశీలన జరుగుతున్నందున మధ్యాహ్నం తరువాత ధరఖాస్తుల సంఖ్య అబ్కారీ శాఖ వెలువరించే అవకావం ఉంది. ఏపీలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుండడంతో అక్కడి లిక్కర్‌ వ్యాపారులు కూడా తెలంగాణాలో మద్యం దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడడంతో గత ఏడాది కంటే ఎక్కువ ధరఖాస్తుదారులు వచ్చాయి. ఎక్సైజ్‌ అధికార యంత్రాంగం అంతా కూడా పారదర్శకత, నిబద్దతలతో పని చేసినందునే ప్రభుత్వానికి గతం కంటే రెట్టింపు ఆదాయం ధరఖాస్తు ఫీజు కింద ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అబ్కారీ శాఖ అధికారులను, సిబ్బందిని అభినందించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.