ETV Bharat / state

Cmd Prabhakar rao: 'సంక్షోభం ఉన్నా... ఎక్కడా విద్యుత్ అంతరాయం లేదు' - Cmd prabhakar rao latest updates

హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని విద్యుత్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ అకౌంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ట్రాన్స్ కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరయ్యారు.

Cmd Prabhakar rao
Cmd Prabhakar rao
author img

By

Published : Nov 29, 2021, 5:14 AM IST

Cmd Prabhakar rao: అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ... రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అంతరాయం లేకుండా అందజేస్తున్నామని ట్రాన్స్ కో-జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు (Cmd Prabhakar rao) తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎంత లోడ్ వచ్చినా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని విద్యుత్ కార్యాలయంలో జరిగిన విద్యుత్ అకౌంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్ప బలానికి, దూరదృష్టికి తోడు రెండేళ్లుగా మంచి వర్షాలు కురవడం వల్ల హైడ్రో జనరేషన్ అనుకున్నదాని కంటే అదనంగా ఉత్పత్తి చేశామన్నారు. రాబోయే రోజుల్లోనూ కోతలు లేకుండా విద్యుత్ అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అకౌంట్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక జరిగింది. అధ్యక్షుడిగా అశోక్, కార్యదర్శిగా అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఇదీ చూడండి: RTC MD Sajjanar tweet: బస్సులో ఈ విద్యార్థి చేస్తుంది చూస్తే ఆశ్చర్యపోతారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.