సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాను కొనసాగించాలని... ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారలను ఆదేశించారు. విద్యుత్ సరఫరాను పర్యవేక్షించడానికి విద్యుత్ సౌధలోని ట్రాన్స్ కో ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశామని తెలిపారు.
ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మే, జూన్ మాసాల్లో ఎక్కువగా గాలి, దుమారాలు వస్తుంటాయని... వాటివల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. వైద్య, ఆరోగ్యశాఖతో సమన్వయంతో విద్యుత్ సౌధలో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఐదు మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటిన తెరాస