Delay in South Central Trains : దక్షిణ మధ్య రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో గమ్యస్థానాలకు చేరలేక అవస్థలు పడుతున్నారు. సమయపాలనలో రైల్వే దక్షిణ భారతానికి 11వ స్థానంలో ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల జరిగిన ఓ ఘటన దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
South Central Trains Delay : ఇటీవల మహారాష్ట్ర నుంచి ఖమ్మం వరకు రైల్లో ప్రయాణిస్తున్న అయిదుగురు ప్రయాణికులు నిజామాబాద్‌లోని మిత్రుడికి ఫోన్ చేశారు. రైల్లో తినడానికి మంచి ఆహారం దొరకడం లేదని, రైలు నిజామాబాద్‌కి రాత్రి 8 గంటలకు వస్తుందని ఆ సమయానికి మంచి భోజనం తీసుకురమ్మని చెప్పారు. మిత్రుడు వారు చెప్పినట్టు భోజనం తీసుకుని రాత్రి 7.40 గంటలకి నిజమాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఆ ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు తర్వాత కూడా నిజమాబాద్ స్టేషన్‌కు చేరుకోలేదు. రైలు ఆలస్యం వల్ల వారంతా ఆకలితో స్టేషన్ చేరుకునే వరకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.
సమయపాలనలో ఎన్నో స్థానం తెలుసా: రైల్వేశాఖ అంతర్గత నివేదిక (2022-2023) ప్రకారం దేశంలోని 19 జోన్లలో దక్షిణ మధ్యరైల్వే జోన్ సమయపాలనలో 11వ స్థానంలో ఉంది. సగటు రోజుకు నూరు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాని ఫలితంగా ఏటా దాదాపు 3 కోట్ల మంది ప్రయాణికులు సకాలంలో గమ్యం చేరుకోలేక పోతున్నారని అంచనా. కార్యాలయాలకు, ఇతర ముఖ్యమైన పనులకు హాజరు కావడానికి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మధ్యలో ఆలస్యం.. చివర్లో స్పీడు.. రైళ్లు మార్గం మధ్యలో ఆగే స్టేషన్లకు బాగా ఆలస్యంగా చేరుకుంటున్నాయి. ఈ ఆలస్యాన్ని కొంతైనా సర్దుబాటుచేయడానికి చివరలో ట్రైన్ స్పీడు పెంచుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే దురంతో ఎక్స్‌ప్రెస్ విజయవాడకు 50 నిమిషాలు, గుంటూరుకు ఏకంగా గంట ఆలస్యంగా వెళుతోంది.
సికింద్రాబాద్-ఔరంగాబాద్ మీదుగా మన్మాడ్ వెళ్లే అజంతా ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ ఆలస్యమే. నిజామాబాద్‌కు 9.20 గంటలకు చేరాల్సిన ట్రైన్ రాత్రి 10.43 గంటలకు గానీ చేరడం లేదు.
రైళు ఎందుకు ఆలస్యంగా వస్తున్నాయంటే.. రైల్వే బోర్డు ఛైర్మన్ ఏకే లహోటి హైదరాబాద్ సందర్శించినప్పుడు ద.మ.రైల్వే పనితీరుపై సమీక్షించారు. 2022-2023లో సమయానికి రైల్లు నడిచేటందుకు 90% లక్ష్యంగా పెట్టుకుని, దాన్ని సాధించకలేపోవడానికి కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం. ముఖ్యంగా రైళ్లు ఆలస్యంగా రావడానికి కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసే గూడ్స్ట్రైన్స్కు ప్రాధాన్యత ఇవ్వడం, జరిగిన అగ్నిపథ్ ఆందోళనలు, సిగ్నలింగ్ లోపాలు.. ఇలాంటి కారణాల వల్ల రైల్లు గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుతున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి: