surpanch
తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 12,680 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు పూర్తి అయ్యాయి. కొత్తగా ఎన్నికైన వారందరూ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పరిపుష్టం చేయాలన్న ఆలోచనలో చట్టంలో కొత్త అంశాలను పొందుపరిచింది రాష్ట్ర ప్రభుత్వం.
గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొంది. చట్టం ప్రకారం ప్రతి పంచాయతీల్లో ఒక నర్సరీ తప్పనిసరి ఏర్పాటు చేయాలి. జనాభాకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లోనే నిధులు కేటాయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.