సికింద్రాబాద్ బేగంపేట్ రసూల్‌పురాలో దివ్యాంగ యోధులకు వివిధ రంగాల్లో నైపుణ్యత శిక్షణ అందిస్తున్న ఆదిత్య మెహెతా ఫౌండేషన్‌తో సీఆర్ఫీఎఫ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశ రక్షణలో భాగంగా శరీర అవయవాలు కోల్పోయి దివ్యాంగులుగా మారిన యోధులకు నెపుణ్యత శిక్షణ అందిస్తున్న ఏఎంహెచ్ సంస్థను ఆయన అభినందించారు.. ఈ సంస్థతో కలసి తాము పనిచేయడం పట్ల సీఆర్ఫీఎఫ్ డీజీ ఏపీ మహేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో శిక్షణ పొందిన దివ్యాంగ యోధులను కలసి వారితో ముచ్చటించారు. పలు క్రీడాంశాల్లో ప్రతిభ కనబరచిన వారికి బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుర్గా ప్రసాద్, సదరన్ సెక్టార్ ఏడీజీ సీఆర్పీఎఫ్ ఎమ్మార్ నాయక్ పాల్గొన్నారు.