Train Ticket Reservation for Pongal Festival : సంక్రాంతి పండుగ తెలుగువారికి పెద్ద పండుగ. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే పండగ హడావిడి మాములుగా ఉండదు. సంక్రాంతి పండగ రోజు కొత్త అల్లుళ్లు, కోడిపందాలు.. ఇంటి బయట గొబ్బెమ్మలతో పండగకళ వస్తోంది. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా స్వస్థలాలకు వస్తారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతుండగా రైల్వే కూడా స్పెషల్ ట్రైన్స్ నడుపుతుంది. అయినా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు టికెట్ రిజర్వేషన్ కోసం వెళ్తే జాబితా పెద్దగానే కనిపిస్తోంది. ఏ రైలు చూసినా వందల సంఖ్యలో వెయిటింగ్ లిస్ట్ అని చూపిస్తోంది.
Prathidwani సంక్రాంతి పండుగ చెప్పే సంగతులు ఏంటో మీకు తెలుసా
Special Trains for Sankranti Festival 2023 : కొత్త సంవత్సరం మొదలవుతోంది. సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. సంక్రాంతి పండగకి సుమారు నెలన్నర ముందు ఉండగానే ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారు. దీంతో వెయిటింగ్ లిస్ట్ వందల్లో ఉంది. కొన్ని రైళ్లకు రిగ్రెట్ కూడా వస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్నారు. వారిలో చాలామంది సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
నాలుగు తరాల కుటుంబసభ్యులను ఒక్కటి చేసిన సంక్రాంతి.. ఎక్కడంటే..?
IRCTC Ticket Booking Online : వచ్చే ఏడాది జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ ఉన్నాయి.దీంతో జనవరి 11, 12, 13 తేదీల్లో నడిచే రైళ్లు ఇప్పటికే బుకింగ్‌తో నిండిపోగా, అనేక మంది ఊర్లకు వెళ్లే సమయానికి కన్ఫర్మ్ అవుతుందనే ఆశతో బుకింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వెళ్లే.. విశాఖ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, విశాఖపట్నం వందేభారత్, ఈస్ట్‌కోస్ట్, జన్మభూమి, గోదావరి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గరీబ్‌రథ్‌తో పాటు చెన్నై, ముంబయి, బెంగళూరు నుంచి ఒడిశా వైపు వెళ్లే రైళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం అదనంగా కొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ వాటిలో సౌకర్యాలు ఉండటంలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి రైళ్లలో సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. రైళ్లు సరిపోవట్లేదని ప్రయాణికులు అధికారుల దృష్టికి తెస్తున్నారు.