ETV Bharat / state

ట్రాఫిక్​ సిగ్నల్స్ సమస్యలకు త్వరలో పరిష్కారం

భాగ్యనగరంలో ట్రాఫిక్​ సమస్యను గాడిలో పెట్టేందుకు  జీహెచ్​ఎంసీ చర్యలు ప్రారంభించింది. గ్రేటర్ అధికారులు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రచించి ట్రాఫిక్​ సమస్యకు చరమగీతం పాడతామని కమిషనర్​ దానకిషోర్​ తెలిపారు.

పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైన జీహెచ్​ఎంసీ కమిషనర్​
author img

By

Published : Feb 7, 2019, 6:48 PM IST

ట్రాఫిక్​ సమస్య పరిష్కరించేందుకు జీహెచ్​ఎంసీ కసరత్తు
హైదరాబాద్​లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ కసరత్తు ప్రారంభించింది. నగరంలో అక్కడక్కడా సిగ్నలింగ్ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించింది. వాటిని వెంటనే పరిష్కరించాలని భారత్‌ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌కు సూచించింది. ట్రాఫిక్ ఇబ్బందులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ నగర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. త్వరలో అందుబాటులోకి రానున్న కమాండ్ కంట్రోల్‌ టవర్స్‌ను జీహెచ్‌ఎంసీతో అనుసంధానం చేస్తామని కమిషనర్ వెల్లడించారు. రూ.200 కోట్లవ్యయంతో పనులు చేపట్టాల్సి ఉందన్నారు. రానున్న 40 ఏళ్లలో ట్రాఫిక్ చర్యలపై లియో ఏజెన్సీ ద్వారా సర్వే చేయించామన్నారు. నగరంలో మరిన్ని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్​లు నిర్మిస్తే చాలావరకూ సమస్యను అధిగమించొచ్చని సూచించారు.
undefined

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.