ETV Bharat / state

న్యూయర్‌ వేడుకల వేళ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు - ఆ రూట్లలో వాహనాలకు నో ఎంట్రీ

Traffic Restrictions in Hyderabad : న్యూయర్‌ వేడుకల వేళ నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్‌ మహంతి పేర్కొన్నారు. పీవీఎన్‌ఆర్ ప్లైఓవర్, ఔటర్‌ రింగ్‌రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల అనుమతి ఉండబోదన్నారు. ఈ రూట్లలో విమానాశ్రయ పాసులు ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.

Traffic Restrictions in cyberabad
Traffic Restrictions in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:18 PM IST

Traffic Restrictions in Hyderabad : కొత్త సంవత్సరం వేడుకల వేళ మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి(CP Avinash mohanthy) హెచ్చరించారు. న్యూయర్‌ వేడుకల సందర్భంగా వాహనదారులు పాటించాల్సిన నియమాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు పీవీ ఎక్స్‌ప్రెస్‌వే(PV Express Way), ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వాహనాల అనుమతి ఉండబోదన్నారు.

ఈ ఏడాదిలో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి - మహిళలపై నేరాలు తగ్గాయి : రాచకొండ సీపీ

Traffic Restrictions in cyberabad : సదరు రూట్లలో శంషాబాద్ విమానాశ్రయం(Shamshabad airport) వెళ్లే పాసులు ఉండే వాహనాదారులకు అనుమతి ఇవ్వనున్నట్లు సీపీ తెలిపారు. క్యాబ్, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ రైడ్స్ నిరాకరించొద్దన్నారు. పబ్, క్లబ్బుల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే యజమానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించిన కస్టమర్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మోటార్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్​లో పెరిగిన నేరాలు - డ్రగ్స్, భూదందాలపై ఉక్కుపాదం మోపుతాం : సీపీ శ్రీనివాస్​ రెడ్డి

నూతన సంవత్సర ప్రారంభ వేడుకల్లో ప్రజలు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్‌ఆర్‌ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మద్యం సేవించి రోడ్లపై తిరగవద్దని, వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త సంవత్సరం వేడుకలను ప్రజలు, యువకులు చేసుకోవచ్చని, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

డిసెంబర్ 31 ఆదివారం రాత్రి 10.00 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్, మైత్రివనం బోరబండ డివిజన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున డ్రంక్‌ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పోలీసుల హెచ్చరిక : వాహనాలలో కిక్కిరిసి ప్రయాణించడం, వాహనాల పై భాగంలో ప్రయాణించడం, బహిరంగ ప్రదేశాల్లో ఇబ్బంది కలిగించడం వంటివి చేసినా కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, మితి మీరిన శబ్దాలు, ప్రమాదకరంగా వాహనాలు నడపడం, వాహనాలపై ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వాహనదారులు జాగ్రత్తగా, బాధ్యతగా సురక్షితంగా వాహనాలు నడిపి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు కోరారు.

డ్రగ్స్‌ ముఠాలను సహించేది లేదు - పబ్స్‌ యజమానులు జాగ్రత్త ఉండాలి : హైదరాబాద్‌ సీపీ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.