అధ్వానంగా మారిన రోడ్డుతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు చూడలేక ట్రాఫిక్ పోలీసులు పార చేతపట్టి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ నల్ల చెరువు వద్ద వంతెన నిర్మాణం కారణంగా రోడ్డు అధ్వానంగా మారింది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
నిన్న రాత్రి కురిసిన వర్షానికి అవి మరింత ప్రమాదకరంగా మారడంతో... వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు మట్టి, నిర్మాణ వ్యర్థాలను తీసుకువచ్చి ఆ గుంతలను స్వయంగా పూడ్చారు.
ఇదీ చూడండి: Formation Day: రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు..