ETV Bharat / state

వాహనదారులకు అందుబాటులోకి రానున్న టీ20 యాప్​

వాహనదారుల సౌలభ్యం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అవగాహన కలిగించేలా టీ20 అప్లికేషన్​ను రూపొందించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన ఈ యాప్​ ప్రస్తుతం ట్రాఫిక్ శిక్షణా కేంద్రాల్లో ఉపయోగిస్తున్నారు. టీ20 యాప్ నెల రోజుల్లో.. ప్రజలకు అందుబాటులో రానుంది.

traffic police introduce t20 app comming soon in hyderabad
వాహనదారులకు అందుబాటులోకి రానున్న టీ20 యాప్​
author img

By

Published : Jan 19, 2021, 3:48 PM IST

టీ20.. గత కొన్నేళ్లుగా ఈ పదం ఎంతో వినియోగంలోకి వచ్చింది. క్రీడాభిమానులను కట్టిపడేసిన పొట్టి క్రికెట్​కు సంబంధించిన టీ20 పదాన్ని ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులు ఓ యాప్​ను రూపొందించారు. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు అవగాహన కలిగేలా 20 ప్రశ్నలతో రూపొందించిన ప్రశ్నావళిని ఈ యాప్​లో పొందుపర్చారు. అందుకే ట్రాఫిక్-20 పేరుతో అర్థం వచ్చేలా టీ20 పేరును పెట్టారు. డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆన్​లైన్ పరీక్ష పెడతారు. అందులో 20 ప్రశ్నలకు గాను కనీసం 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెబితేనే.. డ్రైవింగ్ లైసెన్సు మంజూరవుతుంది. విఫలమైతే మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిందే.

కప్ గెల్చుకోవచ్చు

ఇలాంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ పోలీసులు టీ20 యాప్​ను​ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యాప్​లో వాహనదారుడు 20 ప్రశ్నలకు సమాధానాలివ్వొచ్చు. 18 కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానమిస్తే వెంటనే ట్రాఫిక్ పోలీసులు వర్చువల్​లో అందించే కప్​ను గెల్చుకోవచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాప్​ను ప్రస్తుతం గోషామహల్, బేగంపేట్, కమాండ్ కంట్రోల్​లో ఉన్న ట్రాఫిక్ శిక్షణా కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. ఇందులో రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణకు సంబంధించి 450కి పైగా ప్రశ్నలుంటాయి. ఏ,బీ,సీ పేర్లతో మూడు సెట్లలో ప్రశ్నావలి ఉంటుంది. వాహనదారుడు తనకు నచ్చిన సెట్​ను ఎంపిక చేసుకొని అందులో ఉన్న 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుంది. అందులో ఒకవేళ అర్హత సాధించకపోతే మరోసారి పరీక్షలో పాల్గొనాలని లింకును చూపిస్తుంది.

పెరుగుతున్న ప్రమాదాలు

రహదారి ప్రమాదాలు నిత్యం పెరుగుతున్నాయి. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు.... వాహనదారులు నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రహదారి లోపాల వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది రాష్ట్రంలో 6 వేల 200 మందికిపైగా.. రహదారి ప్రమాదాల్లో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 252 మంది, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 692, రాచకొండ పరిధిలో 562 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా లక్ష యాభై వేల మంది చనిపోయారు.

మాసోత్సవాలు

దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను... ఈ ఏడాది నుంచి నెల రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 నుంచి ఫిభ్రవరి 17 వరకు రహదారి భద్రతపై పోలీసులు, రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు, ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటిపై అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఒకడుగు ముందుకు వేసి.. యాప్​ను రూపొందించి వాహనదారులకు మరింత దగ్గరవుతున్నారు. 2019తో పోలిస్తే 2020లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల్లో మృతి చెందిన వాళ్ల సంఖ్య తగ్గింది. దీన్ని మరింత తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

త్వరలో అందుబాటులోకి యాప్​

టీ20 యాప్​ను అన్ని ప్రభుత్వ వెబ్ సైట్లతోపాటు... గూగుల్ ప్లే స్టోర్​లోనూ నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గించొచ్చని పోలీసులు చెబుతున్నారు. టీ20 యాప్​ను ఉపయోగించుకొని ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆసీస్​పై టీమ్​ఇండియా చారిత్రక విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.