హైదరాబాద్ బంజారాహిల్స్లో ట్రాఫిక్ పోలీసులు అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి ఉన్న ఓ వాహనదారుడు హల్చల్ చేశాడు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ.. కారు నుంచి దిగనని భీష్మించుకు కూర్చున్నాడు. చివరకు ఖాకీలు కారు చుట్టూ బారికేడ్లను కట్టడి చేసి అతనిని కిందకు దించారు.
200 దాటిన ఆల్కహాల్ శాతం
కారు యజమాని రెండు వందల శాతం మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో మొత్తం పది కార్లను స్వాధీనం చేసుకున్నట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. ప్రసాదరావు పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపి ఇతరులకు ఇబ్బందులు కల్గించవద్దని సూచించారు.