లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆదివారం వరకు భారీగా కేసులు నమోదు చేయడంతో పాటు పెద్ద సంఖ్యలో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మోటార్ వాహనాల చట్టం కింద 12,939 కేసులు నమోదుకాగా 1,842 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించిన మరో 2,962 వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
లాక్డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన కేసులను పరిశీలిస్తే... ఎలాంటి పత్రాలు లేని 911 మంది వాహనదారులపై కేసులు నమోదు చేయగా... డబుల్రైడింగ్ చేసిన 1,391 ద్విచక్రవాహనాలపై కేసులు పెట్టారు. సింగిల్ రైడింగ్ చేస్తూ ఉల్లంఘించిన 660 వాహనదారులపైనా కేసులు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ చెప్పిన 'హెలికాప్టర్ మనీ'కి అర్థమేంటి?