సచివాలయం కూల్చివేత పనుల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని దారులను మూసేశారు. హైదరాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులైన ఖైరతాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వంతెనలతో పాటు హిమాయత్ నగర్ లక్డీకపూల్, రవీంద్ర భారతి, ట్యాంక్ బండ్, లోయర్ ట్యాంక్ బండ్ కూడళ్లను మూసివేశారు. ఈ దారుల మీదుగా వచ్చే వాహనాలన్నింటినీ ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపిస్తున్నారు.
దీనితో ఇతర దారుల్లో వాహనాల రాకపోకలు పెరిగి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కసారిగా వాహనాల రాకపోకలు పెరిగి రద్దీ ఏర్పడింది. బషీర్ బాగ్ ట్రాఫిక్, కంట్రోల్ రూమ్, లక్డీకపూల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
ఇవీచూడండి: నూతన సచివాలయ నిర్మాణం తప్పుకాదు: హైకోర్టు