ETV Bharat / state

కుప్పకూలిన యువకుడు.. సీపీఆర్​ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్​

Constable saved life by performing CPR: నిత్యం రద్ధీగా ఉండే హైదరాబాద్​లోని ఆరాంఘర్​ చౌరస్తా వద్ద ఓ యువకుడు ఉన్న పాటున కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ కానిస్టేబుల్​ రాజశేఖర్​ ఆయన్ను గమనించాడు. అతను గుండెపోటుకు గురైనట్లు గుర్తించి వెంటనే సీపీఆర్​ చేశాడు. ఛాతిపై గట్టిగా అదిమి ప్రాణాలు కాపాడాడు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా.. దానిని చూసిన మంత్రి హారిశ్​రావుతో పాటు సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కానిస్టేబుల్​ను మెచ్చుకున్నారు.

Harish Rao appreciated the constable
Harish Rao appreciated the constable
author img

By

Published : Feb 24, 2023, 5:42 PM IST

బస్​స్టాప్​ వద్ద కుప్పకూలిన యువకుడు.. సీపీఆర్​ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్​

Constable saved life by performing CPR: హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ సర్కిల్​ ఆరాంఘర్​ చౌరస్తా నిత్యం వాహనాలతో రద్ధీగా ఉండే ప్రాంతం. ప్రయాణికులు వారి వారి పనులల్లో బీజీగా ఉన్నారు. ఒకరు ట్రాఫిక్​ సిగ్నల్​ను గమనిస్తూ వాటిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటే.. మరొకరు ఆఫీస్​కు టైమ్​ అవుతోంది బాస్​ ఏం అంటారో అని భయంతో వాహన వేగం పెంచుతున్నారు. ట్రాఫిక్​ సిగ్నల్ పడటంతో చిరు వ్యాపారులు ఇదే అదునుగా వారి వస్తువులు అమ్ముకొని రూపాయి లాభం కోసం చూస్తున్నారు.

ఇంతలో ఎల్బీనగర్​కు చెందిన బాలాజీ అనే యువకుడు ఎల్బీనగర్ నుంచి ఆరాంఘర్ బస్​స్టాప్​ వద్దకు ఆర్టీసీ బస్సులో వచ్చాడు. మరో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఆ యువకుడు అకస్మాత్తుగా ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు. ప్రయాణికులు ఎవరి పనుల్లో వాళ్లు బీజీగా ఉండగా.. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ కానిస్టేబుల్​ రాజశేఖర్​ మాత్రం ఆ యువకుడిని గమనించాడు. అతను గుండెపోటుకు గురైనట్లు గుర్తించాడు. వెంటనే అతనికి సీపీఆర్​ చేశాడు. అతని ఛాతి భాగాన అరచేతిలతో గట్టిగా నొక్కాడు. యువకుడు సృహలోకి వచ్చేవరకు గట్టిగా అదిమాడు.

దీంతో ఆ యువకుడికి మెలుకువ రాగా.. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్​కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆయన్ను మెరుగైన వైద్యం నిమిత్తం అత్తాపూర్​లోని జర్మన్​ టెన్​ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించిన అక్కడి వైద్యులు సరైన సమయానికి సీపీఆర్​ చేయడంతో ఆయన ప్రాణాలు నిలిచాయని తెలిపారు. కానిస్టేబుల్​ సీపీఆర్​ చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కాగా.. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్​రావు కానిస్టేబుల్​ రాజశేఖర్​ ఎంతో సమయస్పూర్తితో వ్యవహరించి ఆయన ప్రాణాలు కాపాడారని కొనియాడారు.

అంతే కాకుండా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సీపీఆర్​ గురించి అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ ఉద్యోగులు, వర్కర్లకు వచ్చేవారం సీపీఆర్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. ఇటివలే కాలంలో గుండెపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సీపీఆర్​ శిక్షణ వల్ల మంచి సత్ఫలితారు సాధించవచ్చనని ఆయన పేర్కొన్నారు. సమయాస్ఫూర్తితో వ్యవరించిన రాజశేఖర్​ను మంత్రితో పాటు పలువురు అభినందించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో పాటు ట్రాఫిక్ సీఐ శ్యామ్ సుందర్​ సహా స్థానిక ప్రజలు రాజశేఖర్​ను మెచ్చుకున్నారు.

ఇవీ చదవండి:

CCTV Footage : జిమ్​లో కసరత్తులు చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

కార్డియాక్​ అరెస్ట్​.. CPR చేయడం ఎలా? గాంధీ ఆసుపత్రిలో 10 వేల మందికి ట్రైనింగ్

గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్​ చేసి రక్షించిన సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.