ETV Bharat / state

ఫైన్​లైనా కడతాం కానీ రూల్స్​ పాటించం - గంటకు 1,731 ట్రాఫిక్​ ఉల్లంఘనల కేసులు - టీఎస్‌ ట్రాఫిక్ చలాన్లు

Traffic Challans Cases in Telangana 2023 : రాష్ట్రంలో గతేడాది గంటకు 1731 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి ఉల్లంఘనల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నా కేసులు మాత్రం తగ్గడం లేదు. వాహనదారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Traffic challans cases in Telangana
Traffic challans cases in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 8, 2024, 12:22 PM IST

Traffic Challans Cases in Telangana 2023 : తెలంగాణలో జరిమానాలు జరిమానాలే, ఉల్లంఘనలు ఉల్లంఘనలే అన్నట్లుంది వాహనాలు నడిపేవారి పరిస్థితి. ఎన్ని కేసులు నమోదవుతున్నా, ఎంత జరిమానా విధిస్తున్నా, వీటికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. 2023 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి గంటకు 1,731 చొప్పున ట్రాఫిక్‌ ఉల్లంఘనలు (Traffic Challans Cases in Telangana) నమోదవుతున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గతేడాది కోటికి పైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు : మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ట్రాఫిక్‌ నిబంధనలు (Traffic Rules) ఉల్లంఘించే వారిని గుర్తించి, జరిమానా విధించడం సులభమైంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. గత సంవత్సరం రాష్ట్రంలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 1,51,63,986 కేసులు నమోదయ్యయి. వీటికి విధించిన జరిమానా రూ.519 కోట్లు. అంటే సగటున రోజుకు 41,544 ఉల్లంఘనలు నమోదవుతుండగా, రూ.1.42 కోట్ల వరకు జరిమానా విధిస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు.

హైదరాబాద్​లో ట్రాఫిక్ కొత్త రూల్స్.. గీతదాటితే రూ.100, అడ్డుపడితే రూ.1000 కట్టాల్సిందే..

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులు : జరిమానా విధించడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉల్లంఘనలకు పాల్పడే వారిలో అవగాహన, జవాబుదారీతనం కలిగించడం. వాహనదారులు జరిమానా చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు కానీ, ట్రాఫిక్‌ నిబంధనలు మాత్రం పాటించడం లేదు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య నరకం చూపిస్తోంది. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణలోని చిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్‌ ఇబ్బందులు అధికమవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు సరైన పర్యవేక్షణ కూడా అందుబాటులో ఉండాలి.

హైదరాబాద్​లో ట్రాఫిక్‌ చిక్కులు తగ్గించేందుకు పోలీసుల ప్రణాళిక

Traffic Problems in Telangana : రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపివేయడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతుంటాయి. వన్‌వేలో ఎదురుగా రావడం, రెడ్‌ సిగ్నల్‌ పడ్డా ముందుకెళ్లడం వంటి ఉల్లంఘనల వల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయి. వంద మందిలో ఒక్కరు నిబంధనలు పాటించకపోయినా, దాని ప్రభావం మిగతావారిపై పడుతుంది. రద్దీ సమయాల్లో రోడ్డు మీద నిబంధనలకు విరుద్ధంగా ఒక్కరు వాహనం ఆపినా ఆ రోడ్డంతా ట్రాఫిక్‌ జామ్ అవుతోంది.

అందుకే నిబంధనలు ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు పెడుతుంటారు. సీసీ కెమెరాల ద్వారా కూడా కేసులు నమోదవుతుంటాయి. వాటిని ఆధారంగా చేసుకొని జరిమానా విధిస్తుంటారు. వీటిని చెల్లించకుంటే వాహనాలను స్వాధీనం చేసుకుంటుంటారు. అయినప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

Discounts on Traffic E Challan in Telangana : అయితే పెండింగ్ చలాన్లు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 25 వరకూ ఉన్న పెండింగ్‌ చలాన్లపై (Discounts on Traffic E Challan in Telangana) రాయితీ ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, టీఎస్‌ఆర్టీసీ బస్సులు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ ప్రకటించటంతో వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

Number Plate Tampering : నంబర్​ ప్లేట్ ట్యాంపరింగ్​పై పోలీసుల నజర్.. తప్పుడు ప్లేట్లు వినియోగిస్తే జైలుకే!

రాంగ్ సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌ చేస్తే ఇకపై భారీ జరిమానా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.