ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని.. రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం వాహనదారుల బాధ్యత అని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఈమేరకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. సేఫ్ లైఫ్.. ఫాలో ట్రాఫిక్ రూల్స్ అంటూ సికింద్రాబాద్ సంగీత్ జుంక్షన్ నుంచి రైల్వే డిగ్రీ కాలేజ్ వరకు రన్ నిర్వహించారు.
చిన్న చిన్న పొరపాట్లతోనే ప్రాణాలు పోతున్నాయి.. ఒక్క చిన్న తప్పు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతున్నది.. ఇక ఎవరూ కూడా రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తున్నారు.
ఇదీ చూడండి: 'ట్రాఫిక్ నియమాలు పాటించటమే పోలీసులకు మనమిచ్చే గౌరవం'