ETV Bharat / state

Traffic at Hyderabad-Vijayawada Highway : సెలవులొచ్చాయ్.. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

Traffic at Hyderabad-Vijayawada Highway : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. పండుగ ఇంకా వారం ఉండగానే జనం పల్లెబాటపడుతున్నారు. ఇక శనివారం నుంచి విద్యార్థులకు సెలవులు రావడంతో భారీ సంఖ్యలో ఊరెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది.

Traffic on national highway, sankranthi traffic
జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
author img

By

Published : Jan 9, 2022, 8:47 AM IST

Updated : Jan 9, 2022, 10:04 AM IST

Traffic at Hyderabad-Vijayawada Highway : సంక్రాంతి పండుగకు ఇంకా వారమే సమయం ఉంది. విద్యార్థులకు సెలవులు కూడా వచ్చేశాయి. ఇంకేం జనం సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. శనివారం నుంచి సెలవులు రావడంతో భారీ సంఖ్యలో జనం భాగ్యనగరం నుంచి పల్లె బాట పట్టారు. ఫలితంగా ఆ హైవేపై వాహనాల రద్దీ మరింత పెరిగింది.

మరోవైపు హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై దట్టంగా పొగమంచు కమ్మేసింది. మంచుదుప్పటి కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున వాహనదారులు బిక్కుబిక్కుమంటూ నడుపుతున్నారు. వాహనాల రద్దీ దృష్ట్యా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపు కేంద్రాల పెంచారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్​గేట్ వద్ద విజయవాడ వైపు 10 కేంద్రాలు తెరవడం వల్ల... నిమిషాల వ్యవధిలోనే వాహనాలు ముందుకు వెళ్లిపోతున్నాయి. ఫాస్టాగ్‌లో నగదు చెల్లింపుతో టోల్‌ప్లాజాల వద్ద సాఫీగా రాకపోకలు సాగుతున్నాయి. సాధారణ రోజుల్లో కంటే భారీగా వాహనాల రాకపోకలు పెరిగాయి.

జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

ఇదీ చదవండి : Telangana Rains Today : రాష్ట్రంలో నేడు, రేపు వడగళ్ల వర్షాలు

Last Updated : Jan 9, 2022, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.