ETV Bharat / state

Trading Cyber Fraud in Hyderabad : సైబర్ నేరగాళ్ల నయా ట్రెండ్.. ట్రేడింగ్ పేరుతో ఐటీ ఉద్యోగికి టోపీ..

Trading Cyber Fraud in Hyderabad : ఈ మద్య కొందరు సైబర్ నేరగాళ్లు బిజినెస్ పేరుతో తక్కువ పెట్టుబడి పెట్టండి.. పెద్ద మొత్తం డబ్బు సంపాదించండి అంటూ కొటేషన్లు చెబుతూ అమాయకులకు గాలం వేస్తున్నారు. వారిని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్లు.. మొదట్లో ఒకటి రెండు సార్లు డబ్బు రాగానే.. మూడోసారి భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అదే అదనుగా భావించిన మోసగాళ్లు.. ఆ డబ్బును కాజేస్తున్నారు. ఇలా హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి ఫారెక్స్‌ ట్రేడింగ్‌తో లాభాల ఆశ చూపించి రూ.73లక్షలు కాజేశారు.

Cyber Crime in Hyderabad
Trading Cyber Fraud in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 3:44 PM IST

Trading Cyber Fraud in Hyderabad : సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి.. బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్‌ మాయాగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకి కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇలాగే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి ఫారెక్స్‌ ట్రేడింగ్‌తో లాభాల ఆశ చూపించి రూ.73లక్షలు కాజేశారు.

Trading Cyber Fraud : ఫారెక్స్‌ ట్రేడింగ్‌తో రూ.వేలల్లో లాభాల ఆశ చూపించిన సైబర్‌ ముఠా ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నుంచి 73 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. తొలిసారి పెట్టుబడికి 22 వేల రూపాయలు లాభం వచ్చినట్లు ఆశపెట్టి.. ఆ తర్వాత వివిధ ఛార్జీల పేరు చెప్పి ఈ మొత్తం కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎంసీఏ పూర్తి చేసిన ఓ వ్యక్తి ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతని వాట్సాప్‌ నెంబరుకు ఫారెక్స్‌ ట్రేడింగ్‌ పేరుతో సందేశం వచ్చింది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని భావించిన అతడు.. అందులో సూచించిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేశారు.

Cyber Fraud In Hyderabad : ఎన్‌ఎస్‌జీ కమాండోని.. ఇల్లు అద్దెకు కావాలంటూ... లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ఆ తర్వాత టెలిగ్రామ్‌ ద్వారా పరిచయమైన కొందరు యూఎస్‌ డాలర్లలో రూపంలో పెట్టుబడులు పెట్టాలని నమ్మించారు. తొలిసారి రూ. 35.24 లక్షలు, ఆ తర్వాత గ్యారంటీ ఫీజు రూ.3.5 లక్షలు, బదిలీ రుసుము రూ.9.04 లక్షలు, బ్యాంకు సెక్యూరిటీ ఫీజు రూ. 2.4 లక్షలు, బ్యాంకు లావాదేవీల రుసుము రూ. 2.40 లక్షలు వసూలు చేశారు. డబ్బు పంపిన ప్రతిసారీ యాప్‌లో లాభాలు వచ్చినట్లు రెట్టింపు సొమ్ము చూపించేవారు.

OTT Subscription Cyber Frauds : తక్కువ ధరకే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ .. యాడ్​ చూసి క్లిక్​ చేశావో.. బుక్కైపోతావ్

దాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించలేదు. ఇలా దఫదఫాలుగా రూ.73.80 లక్షల రూపాయలు వసూలు చేశారు. పెట్టుబడికి లాభాలతో కలిపి 1.29 కోట్లు కనిపించినా.. విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం రూ.22 వేల రూపాయలు మాత్రమే బదిలీ చేశారు. లాభాలు ఇవ్వకుండా పదేపదే డబ్బులు అడగడంతో బాధితుడు అనుమానపడి.. తెలిసిన వారిని సంప్రదించిన తర్వాత అంతా బూటకమని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Fake Diamonds Fraud in Nalgonda : నకిలీ వజ్రాలు చూపించి.. రూ.లక్షలు దోచుకున్న ముఠా.. తస్మాత్ జాగ్రత్త!

Cyber Cheatings in Patancheru : సైబర్​ నేరగాళ్ల నయా రూట్​.. ఫుడ్​ ఆర్డర్​ క్యాన్సిల్​ చేసినందుకు ఖాతా ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.