హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని జిల్లెల గూడలో వివేకనంద చౌరస్తా వద్ద ఓ ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. సూర్యాపేటకు చెందిన నాగేశ్, మంగమ్మ బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు.
జిల్లెలగూడలోని దాసరి నారాయణ కాలనీలో నివాసం ఉంటూ మార్బుల్స్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారి రెండవ కుమారుడైన జగదీశ్(12) బాలాపూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. నిన్న సైకిల్‌పై వెళ్తుండగా... ట్రాక్టర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ట్రాక్టర్ నడిపేవారు మైనర్లుగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: వైద్య సలహాలు మేం పాటిస్తాం.. మీరూ పాటించండి