మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన... హస్తం పార్టీ మునిగిపోయే నావ లాంటిదన్న రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్టీ మారిన ఎందరో కనుమరుగయ్యారని ఆయనకు అదే గతి పడుతుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలెవరూ భయపడాల్సిన పని లేదని... తాము అండగా ఉంటామని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డికి ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : 'నూటికి నూరు శాతం పార్టీ మారతా'