ఎస్సీల పట్ల అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతమ్ ధ్వజమెత్తారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మహిళా కార్పొరేటర్లపై ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని అయన ఆక్షేపించారు. ఈ మేరకు గాంధీభవన్‌లో రామగుండం కార్పొరేట్లతో ఆయన సమావేశం నిర్వహించారు.
అర్ధరాత్రి బలవంతంగా...
ఎస్సీ మహిళా ప్రజాప్రతినిధులపట్ల పోలీసులు గౌరవం లేకుండా అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ప్రీతమ్ తెలిపారు. న్యాయం చేయాలని నిరసన చేస్తున్న మహిళా కార్పొరేటర్లను అర్ధరాత్రి బలవంతంగా తీసుకెళ్లడం దారుణమని కాంగ్రెస్ నేత రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ కలిశామని తెలిపిన ఆయన.. జాతీయ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు.
ఇదీ చదవండి:తరుముతున్న నీటి సంక్షోభం- మేల్కొనకపోతే గడ్డు కాలం