రాష్ట్రంలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే ఫ్రాన్స్ నుంచి రూ.వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని మంత్రి కేటీఆర్ ప్రచారం చేసుకోవడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. లక్షలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు కేటీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఇలా చెప్పుకోవడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు.‘‘
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరు చెలకకు చెందిన అసంపల్లి మహేశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈవిషయం తెలియగానే ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ .. మహేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం నాతో మాట్లాడించగా.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పా. మహేశ్ తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత ఆవేదనతో అడుగుతున్న ప్రశ్న ఇది’’ అని రేవంత్ ట్విటర్‌లో పేర్కొన్నారు. చావు సమస్యకు పరిష్కారంగా భావించొద్దని, కలిసి రణం చేసేందుకు కదలి రావాలని నిరుద్యోగ యువతకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: