Revanth tweet: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 69 చెల్లదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఎత్తివేసిన 111 జీవోపై కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఈ జీవోపై విధించిన స్టే ఆర్డర్‌ను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏలాంటి చర్యలు వద్దని 111 జీవోపై 2007 జులై 16న హైకోర్టు స్టే విధించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111 జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పరివాహ ప్రాంతాన్ని పది కిలోమీటర్ల నుంచి 500 మీటర్లకు తగ్గించాలని కోరడంపై హైకోర్టు స్టే విధించినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన జీవో 69 చెల్లదని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే 111జీవో రద్దు డ్రామా ఆడుతున్నారని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాగా ఇటీవల హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల క్యాచ్ మెంట్ ప్రాంతంలోని గ్రామాల్లో 111 జీవో ద్వారా విధించిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఆంక్షలు ఎత్తివేసిన సర్కార్... జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని షరతు విధించింది.
-
మోసగాడి మరో మోసం…111 జీవో రద్దు...
— Revanth Reddy (@revanth_anumula) April 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
ఈ జీవో పై 16.07.2007 లో హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదు.@KTRTRS రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా!#DramaRao pic.twitter.com/9uEoEmYuGT
">మోసగాడి మరో మోసం…111 జీవో రద్దు...
— Revanth Reddy (@revanth_anumula) April 21, 2022
ఈ జీవో పై 16.07.2007 లో హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదు.@KTRTRS రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా!#DramaRao pic.twitter.com/9uEoEmYuGTమోసగాడి మరో మోసం…111 జీవో రద్దు...
— Revanth Reddy (@revanth_anumula) April 21, 2022
ఈ జీవో పై 16.07.2007 లో హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు స్టే విధించింది.
హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇచ్చిన 69 జీవో చెల్లదు.@KTRTRS రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ డ్రామా!#DramaRao pic.twitter.com/9uEoEmYuGT
ఇదీ చూడండి: జీవో 111లోని ఆంక్షల ఎత్తివేతతో... భూముల ధరలకు రెక్కలే!
జీవో 111 ఆంక్షలు ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..