ETV Bharat / state

పోరాటం చరిత్రాత్మకం.. బంద్​లో భాగస్వామ్యం అవుతాం: ఉత్తమ్ - Uttam latest comments

రైతు సంఘాలు తలపెట్టిన భారత్​బంద్‌కు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతిస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ శ్రేణులంతా భారత్‌ బంద్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు. అన్నదాతలకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకోలు తలపెట్టాలని పేర్కొన్నారు.

రైతన్నకు మద్దతుగా భారత్​ బంద్​లో పాల్గొందాం: ఉత్తమ్​

author img

By

Published : Dec 6, 2020, 7:47 PM IST

దేశవ్యాప్తంగా ఈనెల 8న జరగనున్న భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలపై దేశంలో వివిధ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం చారిత్రాత్మకమని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఏ మాత్రం రాజీలేకుండా పట్టుదలతో రైతు వ్యతిరేక చట్టాలపై ఉద్యమం చేయడం హర్షనీయమని కొనియాడారు.

పోలీసుల సహాయంతో అణచివేయాలని చూసినా... లెక్కచేయకుండా ఎదురొడ్డి తమ ఉద్యమాన్ని కొనిసాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్​ లోపల, బయట కూడా ఆందోళనలు చేసినట్లు తెలిపారు.

రైతన్నకు మద్దతు...

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కిసాన్ సమ్మేళనాలు, రైతుల సంతకాల సేకరణ, ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించి నల్ల చట్టాలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో 8న రైతు సంఘాలు చేపట్టనున్న భారత్ బంద్‌కు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్నదాత ఉద్యమానికి మద్దతుగా బంద్‌లో పాల్గొనాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి: బంద్​కు మద్దతు​.. మేం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.