ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు ఉత్తమ్ బహిరంగ లేఖ

author img

By

Published : Feb 22, 2020, 10:27 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన పీఆర్సీ వెంటనే అమలు చేయాలని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్​కు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు.

TPCC President Uttam Kumar reddy respond by PRC issue

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించిన మేరకు ఫిట్ మెంట్​తో కూడిన నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీపీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డి డిమాండ్​ చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం వారికి అందాల్సిన ఆర్థిక పరమైన లబ్ధి విషయంలో తాత్సారం చేయడం తగదని సీఎం కేసీఆర్​కు లేఖలో సూచించారు. జులై 1, 2018 నుంచి రావాల్సిన 11వ పీఆర్సీ 20 నెలలు గడుస్తున్నా ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు.

పీఆర్సీపై ఏర్పాటైన కమిటీ కాలపరిమితిని పొడిగించటం సమంజసం కాదని ఉత్తమ్​ పేర్కొన్నారు. కమిటీ పొడిగింపునకు గల కారణాలను ప్రజాబాహుల్యంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కనీసం ఉద్యోగుల కోసం మధ్యంతర భృతి - ఐఆర్ అయినా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ నిబంధనల రూపకల్పన, ఈహెచ్ఎస్ బకాయిలు వంటి ఉద్యోగుల సమస్యలపై వెంటనే చొరవ తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి:79 కళాశాలలకు ఇంటర్ బోర్డ్ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.