Revanth Reddy comments on ORR Toll Tender Issue : మరోసారి తనదైన శైలిలో సీఎం కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న జీవో 111 రద్దు, ఓఆర్ఆర్ టోల్ టెండర్ ఇష్యూపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడిన రేవంత్.. తీవ్రస్థాయిలో అధికార పార్టీపై విమర్శలు చేశారు.
అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారు : ఓఆర్‌ఆర్‌ను సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో తెగనమ్మారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఓఆర్ఆర్‌ను తక్కువ ధరకే ముంబయి కంపెనీకి కట్టబెట్టారన్న ఆయన... ఇప్పుడు మరో దోపిడీకి తెర తీశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆలోచనను పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వివరిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇచ్చిన 30 రోజుల్లో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని... అంటే రూ.7,388కోట్లలో 738 కోట్లను ముప్పై రోజుల్లో చెల్లించాలని... ఇవి చెల్లించకుండా ఇంకా సమయం అడుగుతున్నారని దుయ్యబట్టారు. ఒప్పందాన్ని ఉల్లంఘించిన సంస్థకు అనుకూలంగా ఉండేలా అధికారులపై మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. లక్ష కోట్ల ఆస్తిని రూ.7,388 కోట్లకే అప్పగించారని మరోసారి పునరుద్ఘాటించారు. వాయిదాల్లో చెల్లించేలా అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
'ఎప్పుడో రిటైర్ అయిన బీఎల్ఎన్ రెడ్డిని హెచ్‌జీసీఎల్ ఎండీగా నియమించారు. ఓఆర్ఆర్ దోపిడీ కోసమే బీఎల్‌ఎల్ రెడ్డి నియామకం జరిగింది. ఐఆర్‌బీ సంస్థ సింగపూర్ కంపెనీకి 49శాతం వాటా అమ్ముకుంది. కేటీఆర్ సింగపూర్ వెళ్లినప్పుడు తేజరాజు, రాజేష్ రాజు ఎక్కడున్నారు? అక్రమ సొమ్ముతో పెట్టుబడులు పెట్టడానికే కేటీఆర్ విదేశీ పర్యటనలు.షెల్ కంపెనీల వెనుక ఉన్న రాజులు, యువరాజులెవరో తేలాలి. ఓఆర్‌ఆర్ వ్యవహారంపై అర్వింద్ కుమార్ వివరణ ఇవ్వాలి. అరవింద్ కుమార్ నాకు అపాయింట్‌మెంట్ ఎందుకివ్వరు. ఓఆర్‌ఆర్‌లో అవినీతిపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడరు? నా పార్లమెంట్ పరిధి చాలా వరకు జీహెచ్ఎంసీలోనే ఉంది.' -రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy comments on G.O.111 : ఈ నెల 26లోగా ఐఆర్‌బీ సంస్థ నిబంధనల ప్రకారం 10శాతం నిధులు చెల్లించాలని.. లేకపోతే సంస్థ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వకుంటే హెచ్ఎండీఏ, హెచ్‌జీసీఎల్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. సమాచారం ఇచ్చే వరకు అధికారులను నిర్బంధిస్తామని తేల్చి చెప్పారు. జరిగిన అవినీతిపై కాగ్, సెంట్రల్ విజిలెన్స్ సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బండి సంజయ్ ఓఆర్ఆర్ అవినీతిపై ఎందుకు మాట్లాడటం లేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
'2019 జనవరి తర్వాత 111జీవో పరిధిలో కొన్న భూముల వివరాలు చెప్పాలి. 111 జీవో ఎత్తివేత వెనుక ఇంటర్నల్ ట్రేడింగ్. 111జీవో పరిధిలో భూములను కేసీఆర్ కుటుంబసభ్యులు కొన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులు కొన్నాకే 111 జీవో ఎత్తేశారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ నేతలు 111జీవో పరిధిలో భూములు కొన్నా.. వివరాలు బయటపెట్టాలి. 111 జీవో ఎత్తివేతపై ఎన్జీటికీ వెళ్తాం.' - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి :