ETV Bharat / state

REVANTH REDDY: మోదీ, కేసీఆర్​లతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం...కాంగ్రెస్​తోనే సంక్షేమం

author img

By

Published : Aug 15, 2021, 11:09 AM IST

గాంధీభవన్‌లో ఘనంగా 75వ స్వాతంత్ర్య వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడ్డారు.

REVANTH REDDY
REVANTH REDDY

దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహోన్నత వ్యక్తుల స్ఫూర్తితో.... ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీభవన్​లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ముందుగా హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు స్వతంత్ర్య మార్చ్‌ చేపట్టాయి. అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి కార్యకర్తలతో కలిసి త్రివర్ణ జెండాలతో ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బ్రిటీష్‌ పాలకులపై నాడు కాంగ్రెస్‌ చేసిన ఉద్యమాలతోనే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని రేవంత్ రెడ్డి వివరించారు.

కొన్ని రాజకీయపార్టీలు మతాల మధ్య చిచ్చుపెడుతూ... స్వార్ధరాజకీయలకు దేశాన్ని ప్రయోగశాలగా మార్చారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతులకు ఉచిత కరెంట్, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధర, భూములపై సీలింగ్ యాక్ట్ తెచ్చి దళితులకు గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు హక్కులు కల్పించింది కాంగ్రెసేనని తెలిపారు. మోదీ పాసిస్టు ప్రభుత్వం వచ్చాక రైతుల జీవితాలను కట్టుబానిసలుగా మార్చి అంబానీ, ఆదానీలకు తాకట్టుపెట్టేలా నల్ల చట్టాలు తెచ్చారుని ఆరోపించారు. రైతులు మొక్కవోని దీక్షతో 9 నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు.

కేసీఆర్ ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో గిరిజనుల భూములను లాక్కొని... వారిని రోడ్డుపైకి లాగారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే... హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాదని అడ్డొచ్చిన ఆడబిడ్డలను చెట్లకు కట్టేసి హింసిస్తున్నారని అన్నారు. ఖమ్మంలో చంటిపిల్లలున్న మహిళలను జైలుకు పంపడం దారణమన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కీసీఆర్​ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని ఆయన తెలిపారు.

మోదీ, కేసీఆర్​లనిద్దరినీ​ గద్దె దించేందుకు ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఏడాది పొడుగునా పోరాటం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏడేళ్లలో కీసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే రిటైర్ అయిన ఉద్యోగులే ఎక్కువ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పిన ఆయన... దేశాన్ని అఖండ భారత్​గా నిలబెట్టే శక్తి ఒక్క కాంగ్రెస్​కే ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆలోచనలతో ప్రపంచ దేశాల ముందు భారత్​ని ఒక శక్తిగా నిలుపుదామని సూచించారు.

ఇదీ చూడండి:'దేశం మనదే...తేజం మనదే...' గేయ రచయిత కుటుంబ కన్నీటి గాథ ఇది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.