ETV Bharat / state

ముగిసిన టీపీసీసీ సమావేశం- పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగుకు శ్రీకారం - telangana congress

TPCC Meeting in Gandhi Bhavan Today : అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా పని చేశామని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడిని కొనసాగించాలని మంత్రులు పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్​, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జీ దీపాదాస్​ మున్షి తదితరులు పాల్గొన్నారు.

Congress Latest News
TPCC Meeting in Gandhi Bhavan Today
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 8:02 PM IST

TPCC Meeting in Gandhi Bhavan Today : పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారని, వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్(Congress Party) అధికారంలోకి వచ్చిందని మంత్రులు తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు, పార్టీ విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు.

నామినేటెడ్ పదవుల భర్తీకి వేగం పెంచిన కాంగ్రెస్ - ఈ సంక్రాంతికే పూర్తి చేసేలా చర్యలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత బస్ సౌకర్యం విజయవంతం అయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యకర్తల కష్టంతోనే ప్రభుత్వంలోకి వచ్చామని, వారి కష్టాల్లో పాలు పంచుకొంటూ సహకారాన్ని అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam) తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యులంతా ఒక్క కుటుంబంగా పని చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులతో పీసీసీ వారి వారి అభిప్రాయాలను తెలుసుకుంది. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని పలువురు నాయకులు విజ్ఞప్తి చేశారు.

Congress Latest News : జిల్లాల్లో కాంగ్రెస్​ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. పార్టీ గెలుపునకు పని చేసిన వారిందరికీ న్యాయం జరిగేట్లు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. దశాబ్ద కాలం తర్వాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​కు గొప్ప అవకాశం ఇచ్చారని, మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందామని ఉపముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

పార్లమెంట్ ఎన్నికలకు కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్ - తాజా పరిస్థితులపై అధిష్ఠానానికి నివేదిక!

కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని భట్టి సూచించారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మన రాష్ట్రం ఒక వైపు బలోపేతం కావాలని, మరోవైపు మనం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ ఫాక్ట్ వచ్చిందని, ఒక స్వాతంత్య్రం వచ్చినట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని భట్టి విక్రమార్క వివరించారు.

Cong Incharge Deepadas Munsi in TPCC Meet : పార్లమెంట్​ ఎన్నికల్లో పార్టీ నాయకులు ఈసారి మరింత శ్రమించాలని, ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్‌ మున్షీ(Deepadas Munsi) పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలుతో ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోందని తెలిపారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారని ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చామన్నారు. హైదరాబాద్‌లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని పని చేయాలని సూచించారు.

ఆ 94 ఎకరాలను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలి : వీహెచ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.