ETV Bharat / state

Revanth Reddy: 'ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి తీరుతాం'

Erravalli Congress Protest: తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని నిర్బంధాలున్నా ఎర్రవల్లికి వెళ్లి తీరుతామని.. రచ్చబండ కార్యక్రమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి గ్రామానికి వెళ్తే తప్పా అంటూ మల్లు రవి ప్రశ్నించారు.

Erravalli Congress Protest
కాంగ్రెస్ నేతలు
author img

By

Published : Dec 27, 2021, 12:01 PM IST

Erravalli Congress Protest: జూబ్లీహిల్స్‌లోని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. నేడు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సన్నద్ధమయ్యారు. వరి సాగుతో పాటు అన్నదాతల సమస్యలపై గళమెత్తాలని నిర్ణయించారు. ఎర్రవల్లికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై వ్యంగ్యంగా స్పందిస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. పోలీసుల దారులన్నీ తన ఇంటివైపే ఉన్నాయని.. స్వాగతిస్తున్నానంటూ ఎద్దేవా చేశారు.

ఎన్ని నిర్బంధాలున్నా.. ఎర్రవల్లికి వెళ్లి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తాం. ఎర్రవల్లి గ్రామం ఏమైనా నిషేధిత ప్రాంతమా? పోలీసులు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? తాను చేపట్టిన రచ్చబండకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? తెరాస, భాజపా కలిసి వడ్ల అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. ఉమ్మడి కుట్రలో భాగంగానే మంత్రులు దిల్లీ వెళ్లొచ్చారు‌. ఇప్పుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు.

-రేవంత్ రెడ్డి, పీసీసీ ఆధ్యక్షుడు

ఎర్రవల్లికి వెళ్తే తప్పా?

రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్లు ఉన్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆరోపించారు. రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్.. ఆయన ఫామ్​ హౌజ్​లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు.

దిల్లీ వెళ్లిన మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఏం చేశారు? కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలనే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు? రాష్ట్రంలో నియంతృత్వ ప్రభుత్వాన్ని నడపాలని కేసీఆర్‌ భావిస్తున్నారా? రైతులను వరి వేయొద్దన్న కేసీఆర్‌ తన భూమిలో వరి ఎందుకు సాగు చేశారు? కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి గ్రామానికి వెళ్తే తప్పా? మేము కేసీఆర్‌ ఫామ్ హౌస్‌ ముట్టడికి వెళ్లటం లేదు కదా?

-మల్లు రవి, టీపీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షులు

కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసి.. తెరాస తన నియంతృత్వ పాలనను కొనసాగిస్తోందని మల్లు రవి వ్యాఖ్యానించారు. తెరాస ధర్నాలను పోలీసులు ఇలానే అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు.

ఇదీ చూడండి: Congress Leaders House Arrest: కాంగ్రెస్ నేతల ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.