మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రజలను అవమాన పరిచేలా జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు నిర్వహించిన తీరుకు మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఎన్నికల సంఘం సిగ్గుపడాలన్నారు. తండ్రీకొడుకులు ఫామ్‌హౌస్‌లో కూర్చుని సీట్లు రాసుకుంటే సరిపోయేదని దుయ్యబట్టారు. చీఫ్ జస్టిస్, కేసీఆర్ కోర్టు బయట మాట్లాడుకున్నట్లు మీడియాలో వార్తను... సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టి తీసుకెళ్లడంతో పాటు, పార్లమెంట్లో ప్రస్తావించున్నట్లు స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తాను... ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్‌ను తన నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకున్నందున... ఇక్కడ ఓటేయటం తన హక్కు అన్నారు. దేశంలో మరే ప్రాంతంలో తనకు ఓటు లేదని స్పష్టం చేశారు. తన ఓటుహక్కును కాంగ్రెస్ పునరుద్ధరించిదని తెలిపారు.
ఇదీ చూడండి: 'నేనేతప్పూ చేయలేదు.. కేవీపీకి తెలంగాణలో ఓటే లేదు'