Revanth Reddy Fire On Cm Kcr: రాహుల్‌గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఓయూలో రాహుల్‌గాంధీ సమావేశాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఓయూను సందర్శించడానికి వీసీని తమ నేతలు జగ్గారెడ్డి, వీహెచ్‌లు అనుమతి కోరారని ఆయన తెలిపారు. బానిసలు మాట్లాడే మాటలపై తాను మాట్లాడనని... వారిని అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం చెప్పులతో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రబ్బరు చెప్పులు లేనోడు కూడా రాహుల్‌గాంధీ గురించి మాట్లాడతాడా అంటూ మండిపడ్డారు.
రాహుల్‌గాంధీ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. మా నేతలు జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీ అనుమతి కోరారు. రాహుల్‌గాంధీ ఓయూకు వస్తే కేసీఆర్‌కు ఎందుకు భయం. కేసీఆర్ ఎలాంటి సంకుచితమైన ఆలోచనలతో ఉన్నాడో వారి నిర్ణయాలను బట్టి మనం ఆలోచించవచ్చు. రాహుల్‌గాంధీ సందర్శనను ఎందుకు అడ్డుకుంటున్నారు. బానిసలు మాట్లాడే మాటలపై నేను మాట్లాడను. రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదు.
-- రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్
అనుమతి లేకపోతే: ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులతో సమావేశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం వీసీని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అనుమతి కోరారు. ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. పార్టీలకతీతంగా విద్యార్థులతో సమావేశమయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని సైతం కాంగ్రెస్ ఆశ్రయించింది. అనుమతి రానిపక్షంలో మరుసటి రోజు.... రాహుల్ షెడ్యూల్ ఏవిధంగా ఉండాలి... రైతులు, నిరుద్యోగులతో రాహుల్ గాంధీ నేరుగా మాట్లాడే అవకాశాలపై కూడా నాయకులు చర్చిస్తున్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ నియమ నిబంధనలకు లోబడి కార్యక్రమాలు రూపకల్పన చేయాల్సి ఉందని మాణిక్కం ఠాగూర్ పీసీసీతో పాటు ఇతర నాయకులకు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: