ETV Bharat / state

Tours and Travells: లాక్​డౌన్​తో టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగం కుదేలు

author img

By

Published : Jun 7, 2021, 5:03 AM IST

కొవిడ్‌ ప్రభావంతో టూర్స్ అండ్ ట్రావెల్స్ (Tours and travells) రంగం కుదేలైపోయింది. గ‌త ఏడాది లాక్‌డౌన్‌ (Lockdown)తో షెడ్లకే పరిమితమైన వాహనాలు ... తిరిగి ఈ ఏడాదిలో కోలుకుంటుండగా మరోసారి లాక్‌డౌన్‌ దెబ్బకు.. గిరాకీల్లేక మూలకుపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్, జులై త్రైమాసిక పన్నును రద్దుచేయాలని ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రభుత్వాన్నికోరుతున్నారు.

Tours and travel sector loss
టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగం కుదేలు

కొవిడ్‌ మహమ్మారి టూర్స్ అండ్ ట్రావెల్స్‌ (Tours and travells) వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. వైరస్‌ కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) ప్రభావంతో గతేడాది సుమారు ఏడు నెలలపాటు వాహనాలు రోడ్డెక్కలేదు. తిరిగి ఈ ఏడాదిలోనూ లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చితికిపోతున్నామని ట్రావెల్స్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిక్కుతోచని స్థితి...

ఒక్కో టూర్స్ అండ్ ట్రావెల్‌ కార్యాల‌యంలో చిన్న సంస్థ అయితే ఐదు మంది, పెద్దదైతే సుమారు 500ల మంది వ‌ర‌కు ప‌నిచేస్తారు. వీళ్లతో పాటు మెకానిక్​లు, పెయింట‌ర్లు, రేడియం స్టిక్కర్లు వేసేవారితో కలిపి సుమారు 6 లక్షల మంది ట్రావెల్స్ రంగం మీద ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. వీరంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

ఆదాయానికి గండి...

కరోనాకు ముందు వరకూ గ్రేట‌ర్ ప‌రిధిలో ఐటీ కంపెనీలకు టూర్స్ అండ్ ట్రావెల్స్(Tours and travells) సంస్థలు సుమారు 1లక్షా 50వేల వాహ‌నాలు తిప్పేవారు. ప్రస్తుతం ఐటీ సంస్థలు చాలా వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం నిర్వహిస్తుండ‌డంతో వీరి ఆదాయానికి పూర్తిగా గండి పడింది. ఇక పర్యాటకం కూడా అంతంత మాత్రంగానే ఉంది. గతేడాది ట్రావెల్స్‌ నిర్వాహకుల విజ్ఞప్తితో రాష్ట్రప్రభుత్వం... ఏప్రిల్-మే-జూన్, జూలై-ఆగస్ట్-సెప్టెంబర్‌ త్రైమాసికాల పన్ను రద్దు చేసింది.

పన్ను రద్దు చేయండి...

సుమారు రూ. 263 కోట్ల పన్ను మాఫీ చేసింది. ఈ ఏడాదిలో కూడా వాహనాలు సరిగ్గా తిరగలేదని.. రెండు త్రైమాసికాల పన్ను రద్దుచేయాలని ట్రావెల్స్ నిర్వాహకులు( Travells) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాల నెలవారీ కిస్తీలే కట్టే పరిస్థితి లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం మరోసారి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: LockDown effect: పాస్​ ఉన్నా జరిమానా వేస్తారా..? నడిరోడ్డుపై యువతి ప్రతిఘటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.