ETV Bharat / state

Tourism Expo in Hitex: పర్యాటక రంగానికి ఉత్తేజం.. రారమ్మంటున్న టూరిజం ఎక్స్​పో - తెలంగాణ టూరిజం

Tourism Expo in Hitex:కొవిడ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రంగం టూరిజం. దీనిపై ఆధారపడిన వారికి మరింత ఉత్తేజాన్నిచ్చేందుకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ వేదికగా నిలిచింది. హైదరాబాద్​లోని హైటెక్స్​లో మూడు రోజుల పాటు జరగనున్న టూరిజం ఎక్స్​పో ఇవాళ ఘనంగా ప్రారంభమైంది.

Tourism Expo in Hitex
హైటెక్స్​లో టూరిజం ఎక్స్​పో ప్రారంభం
author img

By

Published : Dec 3, 2021, 7:59 PM IST

Tourism Expo in Hitex: పర్యాటక రంగానికి నూతనోత్తేజం కల్పించేందుకు ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ వేదికగా నిలిచింది. కొవిడ్ దెబ్బకు కుదేలైన టూరిజం రంగానికి ఆదరణ తెచ్చేందుకు నిర్వహిస్తున్న ఎక్స్​పో హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పాల్గొంటున్న 20 రాష్ట్రాలు

Tourism expo in hyderabad: ఈ టూరిజం ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​తో పాటు దేశంలోని 20 రాష్ట్రాల నుంచి టూరిజం శాఖలు, ప్రైవేట్ ప్లేయర్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకులు ఆ నగరాల్లోని ప్రముఖ హోటళ్లు ఇక్కడ స్టాళ్లను నెలకొల్పారు. ఈ ఎక్స్​పో ద్వారా తమ తమ రాష్ట్రాల్లోని బెస్ట్ టూరిజం డెస్టినేషన్లు, తాము అందిస్తోన్న ఆకర్షణీయమైన ప్యాకేజీల సమాచారాన్ని పర్యాటక ఔత్సాహికులకు వివరిస్తున్నారు.

రామప్ప ఆలయ ప్రదర్శన

Telangana tourism:తెలంగాణలో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. నగరంలో ప్రముఖమైన రామోజీ ఫిల్మ్​ సిటీ, చారిత్రక కట్టడాలైన చార్మినార్, గోల్కోండ కోట, వరంగల్​లోని లక్నవరం లాంటి అందమైన పర్యాట ప్రదేశాల ఫోటోలు ఎక్స్​పోలో ప్రదర్శించారు. పలు రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం సమాచారం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అంతకుముందు ఈ టూరిజం ఎక్స్​పోను రాష్ట్రమంత్రి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు.

Tourism packages pan india: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యాటకానికి ద్వారాలు తెరుచుకున్నందున పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ప్యాకేజీలు, అడ్వెంచర్ ట్రిప్పులు ఆఫర్ చేస్తూ పర్యాటక బోర్డులు, సంస్థలు పోటీ పడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

పాండమిక్ తర్వాత హాలిడేస్​కు వెళ్లాలి. చాలామంది వర్క్ ఫ్రమ్​ హోమ్ తర్వాత రిలీఫ్ కోరుకుంటున్నారు. మనదేశంలో చాలా టూరిజం డెస్టినేషన్స్​ ఉన్నాయి. పాన్ ఇండియాలో చాలా చూడాల్సిన ప్రాంతాలు ఉన్నాయి. తెలంగాణలో రామప్ప ఆలయం ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్​లో చారిత్రక కట్టడాల సమాచారం కూడా ఉంది. ప్రధానంగా కశ్మీర్, హిమాచల్ ప్రాంతాలకు ప్యాకేజీలు ఉన్నాయి. వారణాసి, అయోధ్య, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, నాగ్​పూర్, వైల్డ్​ లైఫ్ ఏరియాస్ లాంటి సమాచారం ఇక్కడ లభిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే టూరిజం కోలుకుంటోంది. మేజర్ డెస్టినేషన్స్​కు సంబంధించిన హోటల్స్, ప్యాకేజీల సమాచారం మొత్తం ఇక్కడ లభిస్తుంది. ఈ ఎక్స్​పో 20 రాష్ట్రాలు పాల్గొంటున్నాయి.

- రోహిత్ హన్గల్, డైరెక్టర్, ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్

హైటెక్స్​లో ప్రారంభమైన టూరిజం ఎక్స్​పో

ఇవీ చూడండి:

Sneh milan in Ramoji Film City: రామోజీ ఫిల్మ్‌సిటీలో వైభవంగా గుజరాతీల స్నేహమిలాన్

nagarjuna sagar boating: రేపటి నుంచే సాగర్​ నుంచి శ్రీశైలం బోట్​ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.