Ponds over flow: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొత్తం 43,870 చెరువులకు గాను 8107 పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మరో 8641 చెరువులు 75 నుంచి వందశాతం వరకు నిండాయి. అంటే దాదాపుగా రాష్ట్రంలో మూడో వంతుకు పైగా చెరువులు పూర్తిగా నిండినట్లు తెలుస్తోంది. మరో 7180 చెరువులు 50 నుంచి 75 శాతం వరకు నిండాయి. అదేవిధంగా 8723 చెరువుల్లో నీరు 25 నుంచి 50 శాతం వరకు చేరింది. మరో 11,219 చెరువుల్లో మాత్రం ఇంకా 25 శాతం లోపే నీరు వచ్చింది.
వర్షాలు భారీగా కురిసిన కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, ములుగు ప్రాంతాల్లో దాదాపుగా అన్ని చెరువులు నిండాయి. కామారెడ్డి, ఖమ్మం ప్రాంతాల్లోనూ కొన్ని మినహా దాదాపు అన్ని నిండుకుండలా మారాయి. ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాల్లోని చెరువుల్లోకి మాత్రం నీరు అంతగా చేరలేదు.
ఇవీ చదవండి: భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
ECET Postponed: ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా.. ఎంసెట్ యథాతథం
సీనియర్లు, జూనియర్ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి