ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​ @ 11AM - ETV BHARAT TOP NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

topten-news
టాప్​టెన్ న్యూస్​@11AM
author img

By

Published : Jun 21, 2020, 11:00 AM IST

ఆకాశంలో అద్భుతం

దేశవ్యాప్తంగా రాహుగ్రస్త్య సూర్యగ్రహణం ప్రారంభమైంది. పూర్తిస్థాయిలో వలయాకార సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. మధ్యాహ్నం 12.10 గం.కు గరిష్ఠ స్థితిలో ఉండనుంది. దేశ వ్యాప్తంగా గ్రహణం ఏవిధంగా ఉందో చూసేయండి.

వీహెచ్​కు కరోనా పాజిటివ్​

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే..

మంచుకొండల్లో జవాన్ల యోగాసనాలు

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో-టిబెటన్​ సరిహద్దు దళాలు 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సున్నా డిగ్రీల సెల్సియన్​ ఉష్టోగ్రతను కూడా లెక్క చేయకుండా యోగా చేశారు. ఏఏ ప్రాంతాల్లో ఎలా జరుపుకున్నారంటే..

ఆర్థిక మంత్రి చెప్పిన ఆరోగ్య సూత్రాలు

యోగా అందరి జీవితంలో ఒక భాగం కావాలని... ప్రతి రోజు యోగ సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకని ఇంట్లో యోగా చేసిన ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..

అంతకంతకూ

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి అధికమవుతోంది. మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 15,413 కేసులు నమోదయ్యాయి. మరో 306 మంది వైరస్​కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా మహమ్మారి తీవ్రత ఈ విధంగా ఉంది.

బామ్మా నీ ఆరోగ్య రహస్యం ఏమిటి?

ఆమెకు ఎనభై ఏళ్లు. అనారోగ్యంతో ఏడాది క్రితమే కాలం చేస్తుందనుకున్నారు కుటుంబసభ్యులు. కానీ ఇప్పుడు ఆ వృద్ధురాలి హుషారు చూసి వారు ఆశ్చర్యపోతున్నారు. ఆశలు వదిలేసుకున్న వేళ అనూహ్యంగా కోలుకున్న బామ్మను చూసి మురిసిపోతున్నారు. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా..

కొనసాగుతోన్న ఏరివేత

జమ్ముకశ్మీర్​ షోపియాన్​లో​ ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారంతో భద్రత దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైనికులపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

అపర కుబేరుడు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అప్పుల్లేని సంస్థగా మారడం వల్ల ముకేశ్‌ అంబానీ అంతర్జాతీయ కుబేరుల్లో టాప్‌-10లోకి చేరారు. రిలయన్స్‌ మార్కెట్‌ విలువ రూ.11 లక్షల కోట్లకు చేరడం వల్ల ముకేశ్‌ తొమ్మిదో స్థానంలోకి చేరారు. రియల్‌టైం నికర విలువ ప్రకారం తొలి 10 మంది ఎవరో చూద్దామా..

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా

ఆస్ట్రేలియాలో భారత్​తో జరిగే టెస్టు సిరీస్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​​ స్మిత్​ అన్నాడు. భారత్​ మెరుగైన జట్టు అని అన్నాడు. ఈ సందర్భంగా టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లి గురించి ఈ విధంగా పేర్కొన్నాడు.

సీరియల్​ వేళాయే..

లాక్​డౌన్​తో రెండు నెలలకుపైగా ఆగిపోయిన మీ అభిమాన సీరియల్స్​ మళ్లీ టీవీల్లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈటీవీలో ప్రసారమవుతూ ఎన్నో కుటుంబాలకు చేరువైన పలు ధారావాహికలు జూన్​ 22 నుంచి మళ్లీ మీ ముందుకు రానున్నాయి. అవేమిటంటే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.