ETV Bharat / state

TOP NEWS : టాప్​టెన్​ న్యూస్ @7AM - TOPNEWS

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Feb 20, 2022, 7:03 AM IST

కాంగ్రెస్​కు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్​ నేతల సూచనలతో తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. దిల్లీ పెద్దలను కలిసిన తర్వాత మరోసారి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

  • కుట్రలు నిజమే

ఏపీలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజులు మంజూరు చేసిన కేసులో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసినట్లు, జీవోలో క్యాప్టివ్ మైనింగ్​ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది తేల్చుకోవడానికి కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాలని వెల్లడించింది.

  • సర్వం సిద్ధం

5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రక్రియలో.. మరో కీలక పర్వానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

  • పేలిన మానవబాంబు

సోమాలియాలోని బాలెడ్‌వెయిన్‌ నగరంలో ఓ రెస్టారెంటు వద్ద మానవబాంబు పేలింది. ఈ ఉగ్ర ఘాతుకంలో 15 మంది మృతి చెంది ఉంటారని పోలీసులు వెల్లడించారు.

  • తొలగని ఉద్రిక్తత

ఉక్రెయిన్​ మిలిటరీ ఉన్నతాధికారులపై బాంబు దాడులు చేపట్టారు వేర్పాటువాదులు. దీంతో బాంబు షెల్టర్​లోకి పరుగులు పెట్టారు అధికారులు. వేర్పాటువాద ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు అసోసియేటెడ్​ ప్రెస్​ తెలిపింది.

  • యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలనలో

భారత్‌ బయోటెక్‌ కొవిడ్ టీకా 'కొవాగ్జిన్‌'కు అనుమతి ఇచ్చే అంశాన్ని అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) పరిశీలించనుంది. ఈ మేరకు దానిపై ఉన్న 'క్లినికల్‌ హోల్డ్‌' పరిమితిని ఎత్తివేసింది.

  • పట్టుపట్టేదేవరు..!

వరుస విజయాలతో టీమ్​ఇండియా జోరు మీద ఉంది. సిరీస్​ను సొంతం చేసుకున్న టీమ్​ఇండియా.. ఆఖరి టీ20లో కూడా విండీస్​ను చిత్తు చేసి ఘనంగా సిరీస్​ను ముగిద్దామని ఆశిస్తోంది.

  • సినీ పెద్దల సమావేశం..

తెలుగు సినీ పెద్దలు.. ఇవాళ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్​కు చిరంజీవి, మోహన్​బాబు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు రానున్నట్లు తెలుస్తోంది.

  • ముగిసిన మేడారం మహాజాతర

నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం మహా జాతర ముగిసింది. చివరి రోజు దేవతల వన ప్రవేశం కోలాహలంగా సాగింది. ఈసారి జాతరలో కోటి 30 లక్షల మంది భక్తజనం అమ్మలను దర్శించుకున్నారు.

  • మహా చర్చలు

దేశ రాజకీయాల్లో సమూల మార్పే ధ్యేయంగా కేంద్రంలోని భాజపా సర్కార్​పై గళం విప్పుతున్న సీఎం కేసీఆర్​.. ఇవాళ కీలక భేటీలు జరపనున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో సమావేశం కోసం కేసీఆర్ నేడు ముంబయి వెళ్లనున్నారు.

  • 'తగ్గేదే లే'

కాంగ్రెస్​కు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్​ నేతల సూచనలతో తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. దిల్లీ పెద్దలను కలిసిన తర్వాత మరోసారి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

  • కుట్రలు నిజమే

ఏపీలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి లీజులు మంజూరు చేసిన కేసులో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. విధి నిర్వహణలో భాగంగానే లీజులు మంజూరు చేస్తూ జీవోలు జారీ చేసినట్లు, జీవోలో క్యాప్టివ్ మైనింగ్​ను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదన్నది తేల్చుకోవడానికి కింది కోర్టులో విచారణను ఎదుర్కోవాలని వెల్లడించింది.

  • సర్వం సిద్ధం

5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రక్రియలో.. మరో కీలక పర్వానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడత, పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరగనుంది.

  • పేలిన మానవబాంబు

సోమాలియాలోని బాలెడ్‌వెయిన్‌ నగరంలో ఓ రెస్టారెంటు వద్ద మానవబాంబు పేలింది. ఈ ఉగ్ర ఘాతుకంలో 15 మంది మృతి చెంది ఉంటారని పోలీసులు వెల్లడించారు.

  • తొలగని ఉద్రిక్తత

ఉక్రెయిన్​ మిలిటరీ ఉన్నతాధికారులపై బాంబు దాడులు చేపట్టారు వేర్పాటువాదులు. దీంతో బాంబు షెల్టర్​లోకి పరుగులు పెట్టారు అధికారులు. వేర్పాటువాద ప్రాంతంలో పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు అసోసియేటెడ్​ ప్రెస్​ తెలిపింది.

  • యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలనలో

భారత్‌ బయోటెక్‌ కొవిడ్ టీకా 'కొవాగ్జిన్‌'కు అనుమతి ఇచ్చే అంశాన్ని అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) పరిశీలించనుంది. ఈ మేరకు దానిపై ఉన్న 'క్లినికల్‌ హోల్డ్‌' పరిమితిని ఎత్తివేసింది.

  • పట్టుపట్టేదేవరు..!

వరుస విజయాలతో టీమ్​ఇండియా జోరు మీద ఉంది. సిరీస్​ను సొంతం చేసుకున్న టీమ్​ఇండియా.. ఆఖరి టీ20లో కూడా విండీస్​ను చిత్తు చేసి ఘనంగా సిరీస్​ను ముగిద్దామని ఆశిస్తోంది.

  • సినీ పెద్దల సమావేశం..

తెలుగు సినీ పెద్దలు.. ఇవాళ సమావేశం కానున్నారు. ఈ మీటింగ్​కు చిరంజీవి, మోహన్​బాబు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు రానున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.