ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM - latest news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 10, 2022, 10:59 AM IST

  • కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ

AP CM Jagan-Tollywoods Bigwigs meet: ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారంపై ముఖ్యమంత్రి జగన్​తో సినీ ప్రముఖులు కాసేపట్లో సమావేశం కానున్నారు. కొవిడ్‌తో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న వేళ... టికెట్ రేట్లు పెంచాలని కోరనున్నారు. అలాగే సినిమా పరిశ్రమకు ప్రభుత్వం అండగా నిలవాలని విన్నవించే అవకాశం ఉంది.

  • ఉదయం 9.30 వరకు 8 శాతం పోలింగ్​

ఉత్తర్​ప్రదేశ్​ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9.30 గంటల వరకు 7.95 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఏడు దశల్లో పోలింగ్​ జరగనుండగా.. గురువారం తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో పశ్చిమ యూపీ 11 జిల్లాల్లోని 58 స్థానాలకు ఓటింగ్​ నిర్వహిస్తోంది ఈసీ.

  • ప్రధానిపై ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

Privilege Notice on Prime Minister: రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ తెరాస ఎంపీలు ప్రివిలేజ్‌ నోటీసు ఇచ్చారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఆ పార్టీ ఎంపీలు కె.కేశవరావు (కేకే), సంతోష్‌కుమార్‌, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్‌ కలిసి నోటీసు అందజేశారు. 187వ నిబంధన కింద నోటీసు ఇస్తున్నట్లు ఎంపీలు పేర్కొన్నారు.

  • భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రాజాసింగ్​ గృహనిర్బంధం

BJP MLA's House Arrest: భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్​, రాజాసింగ్​లను పోలీసులు​ గృహనిర్బంధం చేశారు. జనగామలో బుధవారం జరిగిన ఘర్షణలో గాయపడిన భాజపా కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. వారి నివాసాల వద్ద పోలీసులు మోహరించారు.

  • దేశంలో కరోనా తగ్గుముఖం.. 4.44 శాతానికి పాజిటివిటీ రేటు

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. తాజాగా 67వేల మందికి కొవిడ్​ సోకింది. ఒక్కరోజులోనే 1,241 మంది మృతి చెందారు. మరో 1,67,882 మంది వైరస్​ను జయించారు.

  • వడ్డీ రేట్లపై ఆర్​బీఐ కీలక ప్రకటన

ఆర్‌బీఐ విధాన నిర్ణయాలు ప్రకటించారు గవర్నర్‌ శక్తికాంత దాస్​. రెపో రేటు యథాతథంగా 4 శాతం ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. రివర్స్‌ రెపోరేటును కూడా యథాతథంగా 3.35 శాతం ఉంచినట్లు వెల్లడించారు.

  • కరోనా కట్టడికి దోహదపడే కంప్యూటర్ నమూనా సిద్ధం

Coronavirus Computer Model: కరోనా నివారణకు దోహదపడే కంప్యూటర్​ నమూనాను కెనడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నమూనాతో ఒమిక్రాన్​ తర్వాత పుట్టుకొచ్చే వేరియంట్లను అర్థం చేసుకోవచ్చు. దాన్ని సమర్థంగా అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి విషయాలు దీని ద్వారా తెసుకోవచ్చని పరిశోధకలు తెలిపారు.

  • 'మూలధన లాభాల పన్నుపై సమీక్షకు సిద్ధమే'

Tax on Capital Gains : మూలధన లాభాలపై పన్ను విధానాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు షేర్లు, బాండ్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడుల ద్వారా ఆర్జించిన లాభాలపై పన్నును లెక్కగట్టేందుకు అమలవుతున్న కాలపరిమితులు, శ్లాబులను పునఃపరిశీలన చేస్తోందని తెలిపారు.

  • పంత్​ ఆ స్థానంలో బ్యాటింగ్.. ప్రయోగం మాత్రమే: రోహిత్ శర్మ

India vs west indies: వెస్టిండీస్​తో వన్డే సిరీస్​ గెలిచిన రోహిత్ శర్మ.. తమ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. పంత్​ను ఓపెనర్​గా తీసుకురావడం శాశ్వతమేం కాదని అన్నాడు.

  • Mahaan review: విక్రమ్ 'మహాన్' ఎలా ఉందంటే?

Vikram mahaan movie : రియల్ తండ్రి కొడుకులు విక్రమ్-ధ్రువ్.. రీల్ లైఫ్​లో కలిసి నటించిన సినిమా 'మహాన్'. ఈ సినిమా నేరుగా అమెజాన్ ప్రైమ్​లో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల్ని అలరించిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.